‘ఛపాక్’ ట్రైలర్...

     Written by : smtv Desk | Wed, Dec 11, 2019, 07:17 AM

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పడుకొనె ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఛపాక్’. 2005లో 15 సంవత్సరాల వయస్సున్న లక్ష్మీ అగర్వాల్ అనే అమ్మాయిపై ఛపాక్ లో యాసిడ్ దాడి జరిగింది. ఈ ఘటన ఆధారంగా తెరకెక్కతున్న చెపాక్ మూవీలో దీపికా.. యాసిడ్ దాడికి గురైన మాల్టి అనే అమ్మాయి పాత్రలో నటిస్తోంది. తాజాగా ఈ చిత్రం ట్రైలర్ ని దీపికా సోషల్ మీడియా ద్వారా విడుదల చేసింది. ఇందులో దీపికా, యాసిడ్ దాడి తర్వాత అందహీనంగా తయారయ్యిన తన ముఖంతో సమాజంలో ఎలాంటి పరిస్థితులను ఎదర్కుందో చూపించారు. ఇక, ఈ చిత్రంతో దీపికా పడుకొనె నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది. ఈ సినిమాని మేఘనా గుల్జార్ దర్శకత్వం వహించాడు.ఈ మూవీ 2020 జనవరి 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.





Untitled Document
Advertisements