‘కబీర్ సింగ్’ కు దక్కని అవార్డు..... ఆగ్రహంలో షాహిద్ కపూర్

     Written by : smtv Desk | Wed, Dec 11, 2019, 09:53 AM

‘కబీర్ సింగ్’ కు దక్కని అవార్డు..... ఆగ్రహంలో షాహిద్ కపూర్

బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్ నటించిన ‘కబీర్‌సింగ్’ (‘అర్జున్ రెడ్డి’ రీమేక్) ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద భారీ కలెక్షన్లను రాబట్టింది. షాహిద్ కపూర్ నటనకు ప్రేక్షకులు నీరాజనాలు పలికారు. ఈ సినిమా 2019లో హిట్ అయిన సినిమాల జాబితాలో చేరింది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం షాహిద్ కపూర్ ఒక అవార్డుల ఫంక్షన్‌కు హాజరయ్యారు. అయితే ‘కబీర్ సింగ్’లో నటనకు గాను అతనికి ఎటువంటి అవార్డు రాలేదు. దీంతో ఆగ్రహించిన షాహిద్ కపూర్ అవార్డుల ఫంక్షన్ మధ్యలోనే లేచివెళ్లిపోయారని సమాచారం. ఇంతేకాకుండా ఈ ఈవెంట్‌లో డాన్స్ చేసేందుకు కూడా నిరాకరించారు. దీంతో ఈవెంట్ ఆర్గనైజర్ కంగుతిన్నారని భోగట్టా. కాగా ప్రస్తుతం షాహిద్‌కపూర్ ‘జర్సీ’(తెలుగు ‘జర్సీ’ రీమేక్)లో నటిస్తున్నారు.





Untitled Document
Advertisements