భీమ్ ఫాత్రలో తారక్‌...లీకైన RRR పిక్స్

     Written by : smtv Desk | Wed, Dec 11, 2019, 10:04 AM

రాజమౌళి ప్రస్తుతం మల్టీ స్టారర్‌గా తెరకెక్కుతున్న ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మెగా పవర్‌ స్టార్‌ రామ్ చరణ్‌, యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌లు హీరోలుగా నటిస్తున్నారు. పీరియాడిక్‌ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను చరిత్రలో జరిగిన యదార్థ సంఘటనలకు కొంత ఫాంటసీ జోడించి తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో రామ్‌ చరణ్‌ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తుండగా, ఎన్టీఆర్‌ కొమరం భీం పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే మేజర్‌ పార్ట్‌ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా 2020 జూలై 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు సంబంధించి ఇంత వరకు ఎలాంటి మేజర్‌ అప్‌డేట్‌ ఇవ్వలేదు రాజమౌళి. ప్రెస్‌మీట్‌లో పాత్రలు, ఆర్టిస్ట్‌లను ఎనౌన్స్‌ చేసిన జక్కన్న తరువాత విలన్‌ రోల్స్‌లో నటించబోయే విదేశీ నటులను పరిచయం చేశాడు. అయితే సినిమాలో ఎన్టీఆర్, రామ్‌ చరణ్‌ల లుక్స్‌ ఎలా ఉండబోతున్నాయన్నది మాత్రం ఇంతవరకు బయటకు రానీయలేదు. తొలిసారిగా తారక్‌, చెర్రీలు పీరియాడిక్‌ రోల్స్‌ చేస్తుండటంతో వాళ్ల లుక్స్‌ చూసేందుకు అభిమానులు ఎదురుచూస్తున్నారు. తాజాగా ఎన్టీఆర్‌ లుక్‌కు సంబంధించిన ఫోటో ఒకటి లీక్‌ అయ్యింది. షూటింగ్‌ సందర్భంగా ఎన్టీఆర్‌ను ఫోటో తీసిన వ్యక్తి దాన్ని సోషల్‌ మీడియాలో పోస్ట్ చేయటంతో ఆ ఫోటో వైరల్‌గా మారింది. కొమరం భీం పాత్రలో ఎన్టీఆర్‌ లుక్స్‌ అదుర్స్‌ అంటున్నారు ఫ్యాన్స్‌. తలపాగా, పంచె కట్టులో ఎన్టీఆర్‌ వావ్‌ అనిపించేలా ఉన్నాడు. ఈ లుక్‌కు సూపర్బ్‌ రెస్సాన్స్‌ వస్తోంది. బాహుబలిని మించి భారీ బడ్జెట్‌తో ఆర్ఆర్‌ఆర్‌ను తెరకెక్కిస్తున్నాడు రాజమౌళి. ఈ సినిమాను దాదాపు 400 కోట్ల బడ్జెట్‌తో డీవీవీ దానయ్య నిర్మిస్తున్నాడు. బాలీవుడ్‌ నటి అలియా భట్‌తో పాటు విదేశీ నటి ఒలివియా హీరోయిన్‌లుగా నటిస్తుండగా బాలీవుడ్‌ స్టార్‌ హీరో అజయ్‌ దేవగన్‌ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. పీరియాడిక్‌ సినిమా కావటంతో భారీ గ్రాఫిక్స్‌తో ప్రతిష్టాత్మకంగా సినిమాను రూపొందిస్తున్నారు.













Untitled Document
Advertisements