రెడ్ మీ కే30కి సరైన పోటీ ఇచ్చేందుకు వస్తున్న రియల్ మీ

     Written by : smtv Desk | Wed, Dec 11, 2019, 01:07 PM

రెడ్ మీ కే30కి సరైన పోటీ ఇచ్చేందుకు వస్తున్న రియల్ మీ

ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ రియల్ మీ మరో స్మార్ట్ ఫోన్ ను భారత మార్కెట్లో లాంచ్ చేసేందుకు సిద్దమైంది. రియల్ మీ ఎక్స్2 డిసెంబర్ 17న ఇండియాలో విడుదల కానుంది. రియల్ మీ ఎక్స్ టీని లాంచ్ చేసినప్పుడు డిసెంబర్ లో రియల్ మీ ఎక్స్ టీ 730G స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేస్తామని రియల్ మీ చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ స్మార్ట్ ఫోన్ నే రియల్ మీ ఎక్స్2 పేరిట మనదేశంలో లాంచ్ చేయనున్నారు. షియోమీ ఇటీవల చైనాలో రెడ్ మీ కే30ని విడుదల చేసింది. ఇప్పుడు వీటి ధరలను చూసినట్లయితే రెడ్ మీ కే30 4జీ వెర్షన్, రియల్ మీ ఎక్స్2ల మధ్య గట్టిపోటీ తప్పేలా కనిపించడం లేదు. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రత్యేకమైన పేజీ ఫ్లిప్ కార్ట్ లో ప్రత్యక్షమైంది. అంతేకాకుండా ముందుగా రూ.1,000 డిపాజిట్ చెల్లించిన వారికి మొదటి సేల్ లోనే కచ్చితంగా ఫోన్ అందేలా చేస్తామని రియల్ మీ తెలిపింది. అంటే ఈ ఫోన్ కావాలనుకునే వారు డిసెంబర్ 16వ తేదీ లోపు రూ.1,000 డిపాజిట్ చెల్లించాలి. ఆ తర్వాత 17వ తేదీ నుంచి 24వ తేదీ లోపు మిగతా మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. మీరు మిగతా మొత్తాన్ని చెల్లించిన వెంటనే ఫోన్ ను మీకు పంపే ప్రక్రియ మొదలవుతుంది. దీని ధర రూ.15,910గా ఉండనున్నట్లు ఇప్పటికే లీకులు వచ్చాయి. అధికారిక ధర కోసం ఫోన్ విడుదలయ్యే దాకా ఆగక తప్పదు మరి! అయితే ఫ్లిప్ కార్ట్ ప్రత్యేక పేజీలో దీనికి సంబంధించిన ఫీచర్లను ఇప్పటికే తెలిపారు. ఇందులో 6.4 అంగుళాల ఫుల్ హెచ్ డీ + సూపర్ అమోఎల్ఈడీ(AMOLED) డిస్ ప్లే అందించనున్నారు. ప్రాసెసర్ విషయానికి వస్తే.. క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 730G ప్రాసెసర్ ద్వారా ఈ ఫోన్ పనిచేయనుంది. ఈ ప్రాసెసర్ గేమింగ్ కోసం బాగా ఉపయోగపడుతుందని రియల్ మీ తెలిపింది. ఇందులో వెనకవైపు నాలుగు కెమెరాలు ఉన్నాయి. ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగా పిక్సెల్ గా ఉండనుంది. ఈ విషయాన్ని ఫ్లిప్ కార్ట్ పేజీలో వివరించారు. మిగతా మూడు కెమెరాల్లో 8 మెగా పిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగా పిక్సెల్ డెప్త్ సెన్సార్, 2 మెగా పిక్సెల్ మాక్రో సెన్సార్ ఉండనున్నట్లు లీకులు వచ్చాయి. సెల్ఫీ కెమెరా సామర్థ్యం 32 మెగా పిక్సెల్ గా ఉండనుంది. ఇక బ్యాటరీ విషయానికి వస్తే.. 4000 ఎంఏహెచ్ సామర్థ్యమున్న బ్యాటరీని ఇందులో అందించారు. 30W VOOC ఫ్లాష్ చార్జ్ 4.0ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. దీని సాయంతో 30 నిమిషాల్లోనే మీ ఫోన్ 67 శాతం చార్జింగ్ ఎక్కుతుందని రియల్ మీ తెలిపింది. అలాగే ఇందులో ఇన్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ ఫీచర్ కూడా ఉంది.







Untitled Document
Advertisements