మహానటికి లక్కీ ఛాన్స్..!

     Written by : smtv Desk | Wed, Dec 11, 2019, 01:33 PM

సూపర్ స్టార్ రజినికాంత్ సినిమాల వేగం పెంచారు. దర్బార్ రిలీజ్ కాకుండానే శివ డైరక్షన్ లో ఒక సినిమా సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నారు. సన్ పిక్చర్స్ బ్యానర్ లో తెరకెక్కే ఈ సినిమా రజినికాంత్ 168వ సినిమాగా వస్తుంది. ఈ మూవీలో హీరోయిన్స్ గా ఎంతోమందిని అనుకోగా ఫైనల్ గా కీర్తి సురేష్ కు ఆ లక్కీ ఛాన్స్ దక్కింది. ఇక ఈ ఆఫర్ రాగానే సూపర్ స్టార్ సినిమాలు చూస్తూ పెరిగిన తను ఆయన పక్కన నటించడం ఇంతకన్నా గొప్ప విషయం ఉంటుందా అంటుంది కీర్తి సురేష్.

దర్బార్ సినిమాను మురుగదాస్ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా 2020 సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. శివ డైరక్షన్ లో మూవీలో రజిని కొత్త గెటప్ లో కనిపిస్తారట. దర్బార్ రిలీజ్ కాగానే ఆ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుందట. భారీ బడ్జెట్ తో నిర్మించే ఈ సినిమా మరోసారి సూపర్ స్టార్ స్టామినా ఏంటో తెలియచేస్తుందని అంటున్నారు.





Untitled Document
Advertisements