స్మోకింగ్ చేసేవారి కోసం ఇన్సూరెన్స్ పాలసీ

     Written by : smtv Desk | Wed, Dec 11, 2019, 04:17 PM

స్మోకింగ్ చేసేవారి కోసం ఇన్సూరెన్స్ పాలసీ

సిగరెట్ తాగే వారు అంత నస్తాపోతారో వారి పక్కన ఉన్న వారు కూడా సమస్యలు ఎదుర్కోవలసిందే. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం భారత్‌లో 12 శాతం మంది పొగతాగేవారు ఉన్నారు. దేశంలో సిగరెట్ల కారణంగా సంవత్సరానికి కోటి మందికి పైగా చనిపోతున్నారు.

సిగరెట్లు తాగడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. అంతేకాకుండా వీటి వల్ల డబ్బు కూడా ఖర్చవుతుంది. ఇంతటితో అయిపోలేదు. సిగరెట్ తాగే వారు ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలన్నా ఎక్కువ చెల్లించాల్సి వస్తుంది. ఎలా చూసినా పొగతాగడం వల్ల నష్టాలే ఎక్కువగా ఉన్నాయి.కుటుంబ ఆర్థిక భద్రత లక్ష్యంగా ఎవరైనా లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకుంటారు. ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా ఇదే అంశాన్ని ప్రాతిపదికగా తీసుకొని ప్రీమియం వసూలు చేస్తాయి. కుబుంబ చరిత్ర, ప్రస్తుతం మీ ఆరోగ్యం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటాయి. ఈ సమయంలో బీమా సంస్థలు మీకు పొగతాగే అలవాటు ఉందా? లేదా? అని చూస్తాయి.ఇన్సూరెన్స్ కంపెనీలు చాలానే స్మోకింగ్ అలవాటు ఉంటే రిస్క్ ఎక్కువగా ఉంటుందని భావిస్తాయి. దీనికి అనుగుణంగానే ప్రీమియం చార్జీలను పెంచుతాయి. స్మోకింగ్ వల్ల కలిగే అనారోగ్యాలు ఇందుకు కారణం. వీటి గురించి కంపెనీలకు అవగాహన ఉటుందని. అందుకే ప్రీమియం ఎక్కువ వసూలు చేస్తాయి.స్మోకింగ్ వల్ల రక్త పోటు పెరుగుతుంది. గుండె సంబంధిత వ్యాధులు వస్తాయి. అంతేకాకుండా ఊపిరితిత్తులు దెబ్బతింటాయి. అంతేకాకుండా సిగరెట్ తాగడం వల్ల తొందరగానే ముసలితనం వచ్చేస్తుంది. అందుకే ఇన్సూరెన్స్ కంపెనీలు స్మోకింగ్ అలవాటు ఉన్న వారికి ఎక్కువ ప్రీమియం విధిస్తాయి.బీమా కంపెనీలు స్మోకింగ్ అలవాటును చాలా సీరియస్‌గా తీసుకుంటాయి. అందువల్ల పాలసీ తీసుకునే సమయంలో ఎలాంటి విషయాలు దాచిపెట్టొద్దు. మీరు ఒకవేళ సిగరెట్లు కాకుండా ఇసిగరెట్లు కలిస్తే అప్పుడు కూడా మీకు ఎలాంటి మినహాయింపులు ఉండవు. ఇన్సూరెన్స్ కంపెనీలు రెండింటినీ ఒకేలా చూస్తాయి.సిగరెట్ అలవాటు ఉన్నవారు, అలాగే లేనివారు ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటే.. ఇద్దరి మధ్య ప్రీమియం వ్యత్యాసం చాలా ఉంటుంది. ఉదాహరణకు సిగరెట్ అలవాటు ఉన్న 30 ఏళ్ల వయసు ఉన్న వ్యక్తి రూ.కోటి టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలని భావిస్తే.. అతనికి పాలసీ వార్షిక ప్రీమియం రూ.14,750 నుంచి ప్రారంభమౌతుంది. అదే సిగరెట్ అలవాటు లేనివారికి ఈ ప్రీమియం మొత్తం రూ.8,260గా ఉంటుంది.ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలని ప్లాన్ చేస్తే.. అప్పుడు తక్కువ ప్రీమియం మొత్తానికి పాలసీ పొందాలని భావిస్తే అప్పుడు కచ్చితగా స్మోకింగ్ చేయకూడదు. మీరు సిగరెట్లు కాలుస్తూ ఉంటే.. ఆ అలవాటు మానేసిన 12 నెలలు లేదా 18 నెలల తర్వాత పాలసీ తీసుకోండి. అప్పుడు ప్రీమియం తగ్గుతుంది.





Untitled Document
Advertisements