‘అల వైకుంఠపురములో’ టీజర్...అది వైకుంఠపురం

     Written by : smtv Desk | Wed, Dec 11, 2019, 05:08 PM

‘అల వైకుంఠపురములో’ టీజర్...అది వైకుంఠపురం

అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తోన్న మూడో చిత్రం ‘అల వైకుంఠపురములో’. ఈ సినిమాపై బన్నీ అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, పాటలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా తమన్ స్వరపరిచిన పాటలు ఆడియన్స్‌కి బాగా కనెక్ట్ అయిపోయాయి. ఇప్పుడు ఆడియన్స్‌ను మరింత ఉర్రూతలూగించేందుకు ‘అల వైకుంఠపురములో’ టీజర్‌ను తీసుకొచ్చారు. టీజర్ చూస్తుంటే త్రివిక్రమ్ మంచి మాస్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను అందించనున్నట్టు అర్థమవుతోంది. సినిమాలో బన్నీ క్యారెక్టర్ రఫ్ అండ్ టఫ్‌గా ఉండనుంది. ‘వైకుంఠపురం’ అనేది ఇంటి పేరు. ఆ వైకుంఠపురంలోకి అల్లు అర్జున్ అడుగుపెడతాడు. అతను ఎవరు, ఆ ఇంటిలోకి అల్లు అర్జున్ ఎందుకు అడుగుపెట్టాడు వంటి ఆసక్తికర ప్రశ్నలను ఈ టీజర్‌తో త్రివిక్రమ్ లేవనెత్తేలా చేశారు. డైలాగులు కూడా ఆయన స్టైల్లోనే ఆసక్తికరంగా ఉన్నాయి. కామెడీకి అయితే డోకా లేదు. తమిళ నటుడు, దర్శకుడు సముద్రఖని ఈ సినిమాలో విలన్ అని అర్థమవుతోంది. గీతా ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లపై అల్లు అరవింద్, ఎస్.రాధాకృష్ణ (చినబాబు) సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. కాగా.. ఈ చిత్రంలో టబు, రాజేంద్రప్రసాద్, సచిన్ ఖేడ్ కర్, తనికెళ్ళ భరణి, మురళీ శర్మ, సముద్రఖని, జయరాం, సునీల్, నవదీప్, సుశాంత్, నివేతా పేతురాజ్, గోవిందా పద్మసూర్య, కల్యాణి నటరాజన్, రోహిణి, ఈశ్వరీ రావు, శిరీష, బ్రహ్మాజీ, హర్షవర్ధన్, అజయ్, రాహుల్ రామకృష్ణ, పమ్మి సాయి నటిస్తున్నారు. తమన్ సంగీతం సమకూరుస్తున్నారు.






Untitled Document
Advertisements