కమల్ హాసన్‌ను కలిసిన బ్రావో

     Written by : smtv Desk | Wed, Dec 11, 2019, 07:52 PM

కమల్ హాసన్‌ను కలిసిన బ్రావో

వెస్టిండీస్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో బుధవారం ప్రముఖ తమిళ హీరో కమల్ హాసన్‌ను కలసుకున్నాడు. గతంలో షూటింగ్ సందర్భంగా గాయపడిన కమల్.. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. బుధవారం చెన్నైకి చేరుకుని కమల్‌ను పరామర్శించాడు. ఈ సందర్భంగా పలు అంశాలపై తను చర్చించాడు. కమల్‌తో కలిసి బ్రావో దిగిన ఫొటోలు వైరల్‌గా మారాయి. కమల్‌తో భేటీ సందర్భంగా ఒక టీషర్ట్‌ను బహుకరించాడు. అంతకుముందు దానిపై బ్రావో సంతకం చేశాడు. మరోవైపు వెస్టిండీస్ జట్టుకు చాలా కాలం దూరంగా ఉంటున్న బ్రావో ప్రపంచవ్యాప్తంగా ఉన్న లీగ్‌లలో ఆడుతున్నాడు. ఐపీఎల్‌లో తను చాలాకాలం చెన్నై సూపర్‌కింగ్స్ తరపున బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. మరోవైపు ఇటీవలే గ్లోబల్ ఐకాన్ ఆఫ్ ఇన్సిపిరేషన్ అవార్డును బ్రావో దక్కించుకున్న సంగతి తెలిసిందే. బిహైండ్స్‌వుడ్స్ సంస్థ అందించిన ఈ పురస్కారంలో భాగంగా బ్రావోన గోల్డ్ మెడల్‌తో సత్కరించారు. మరోవైపు ప్రముఖ డైరెక్టర్ శంకర్‌తో కలిసి ఇండియన్-2లో కమల్ హాసన్ నటిస్తున్న సంగతి తెలిసిందే.






Untitled Document
Advertisements