బెలూన్ కొనివ్వమన్నందుకు చిన్నారిని చంపిన సవతి తండ్రి

     Written by : smtv Desk | Wed, Dec 11, 2019, 08:00 PM

బెలూన్ కొనివ్వమన్నందుకు చిన్నారిని చంపిన సవతి తండ్రి

ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. ‘నాన్న బెలూన్ కొనివ్వు’ అని అడగడమే ఆ చిన్నారి పాపమైంది! నాలుగేళ్ల చిన్నారి అని కూడా చూడకుండా చికతబాది, హతమార్చాడు కిరాతక సవతి తండ్రి. ఈ దారుణ ఘటన మంగళవారం ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో చోటుచేసుకుంది. ఖుల్దాబాద్‌లోని సిద్ధార్థనగర్‌లో అద్దెకు నివసిస్తున్న దంపతులు మందుల కోసం కూతురును వెంటబెట్టుకుని బయటకు వెళ్లారు.ఆ సమయంలో బెలూన్‌ కావాలంటూ నాలుగేళ్ల చిన్నారి సవతి తండ్రిని కోరింది. దీంతో రెచ్చిపోయిన అతను చిన్నారిని ఇష్టమొచ్చినట్టుగా కొట్టాడు. అడ్డొచ్చిన భార్యను సైతం బైక్‌పై నుంచి ఆమెను కిందపడేశాడు. అనంతరం ఆవేశంతో కూతురుని తీసుకుని వెళ్లిపోయాడు. తిరిగి అర్ధరాత్రి ఇంటికి చేరుకుని తన గదిలోకి వెళ్లి గడియపెట్టుకున్నాడు. దీంతో అనుమానం వచ్చి చిన్నారి తల్లి ఫోలీసులకు ఫోన్ చేసి చెప్పింది. అనంతరం ఉదయాన్నే అతడి గదిలోకి వెళ్లి చూసి హతాశురాలైంది. తన కూతురిని భర్త చంపి, గాయాలతో పడి ఉన్నాడని ఆమె పేర్కొంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.





Untitled Document
Advertisements