షాలిని పాండేకి అదిరిపోయే ఛాన్స్..!

     Written by : smtv Desk | Thu, Dec 12, 2019, 05:19 AM

అర్జున్ రెడ్డి సినిమాతో సూపర్ హిట్ అందుకున్న షాలిని పాండేకి తెలుగులో అంత గొప్ప అవకాశాలేమి రావట్లేదని చెప్పొచ్చు. ఎన్.టి.ఆర్ కథానాయకుడు, 118 సినిమాల్లో నటించిన అమ్మడు ప్రస్తుతం రాజ్ తరుణ్ తో ఇద్దరిలోకం ఒకటే సినిమాలో నటించింది. ఈ సినిమా రిలీజ్ కు రెడీ అయ్యింది. ఇక తెలుగులో కెరియర్ ఎలా ఉన్నా బాలీవుడ్ నుండి షాలినికి అదిరిపోయే ఆఫర్ ఒకటి వచ్చింది.

అక్కడ సూపర్ ఫాం లో ఉన్న రణ్ వీర్ సింగ్ కు జోడీ కట్టే ఛాన్స్ అందుకుంది షాలిని పాండే. యశ్ రాజ్ ఫిలంస్ బ్యానర్ లో దివ్యాంగ్ ఠక్కర్ తెరకెక్కిస్తున్న జయేష్ భాయ్ జోర్దార్ సినిమాలో హీరోయిన్ గా షాలిని ఎంపిక చేశారు. ఈ విషయాన్ని అఫిషియల్ గా కూడా ఎనౌన్స్ చేశారు. మహిళలకు, పురుషులకు సమాన హక్కులు ఉండాలని భావించే కథతో వస్తుందని తెలుస్తుంది. ఈ సినిమాను మనీష్ శర్మ నిర్మిస్తున్నారు. షాలిని పాండేకి ఈ మూవీలో ఛాన్స్ రావడం లక్కీ అని చెప్పొచ్చు. మరి తెలుగులో ఎలాగు పెద్దగా క్రేజ్ సంపాదించలేని షాలిని బాలీవుడ్ లో అయినా అదరగొడుతుందేమో చూడాలి.





Untitled Document
Advertisements