వెంకీ ఇంట్రెస్ట్...... ఆ దర్శకుడిపైనే

     Written by : smtv Desk | Thu, Dec 12, 2019, 11:52 AM

వెంకీ ఇంట్రెస్ట్...... ఆ దర్శకుడిపైనే

వెంకటేశ్ తాజా చిత్రంగా రూపొందిన 'వెంకీమామ' రేపు భారీ స్థాయిలో ప్రేక్షకులను పలకరించనుంది. పూర్తిస్థాయి వినోదభరిత చిత్రంగా నిర్మితమైన ఈ సినిమాపై అంచనాలు బాగానే వున్నాయి. ఆ తరువాత వెంకటేశ్ 74వ చిత్రంగా 'అసురన్' రీమేక్ సెట్స్ పైకి వెళ్లనుంది. సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్లో ఈ సినిమాను నిర్మించడానికి ఏర్పాట్లు జరిగిపోతున్నాయి.

ఈ నేపథ్యంలో సంఖ్యా పరంగా ప్రాధాన్యతను సంతరించుకున్న వెంకటేశ్ 75వ సినిమాను గురించి అభిమానులు మాట్లాడుకుంటున్నారు. ఇంతకుముందు తరుణ్ భాస్కర్ వినిపించిన ఒక కథకి వెంకటేశ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అందువలన ఆయన 75వ సినిమా తరుణ్ భాస్కర్ తోనే ఉండొచ్చునని కొందరు అంటున్నారు. 'సరిలేరు నీకెవ్వరు' తరువాత అనిల్ రావిపూడి వెంకటేశ్ తో 'ఎఫ్ 3' చేయాలనుకుంటున్నాడు. అనిల్ రావిపూడి సక్సెస్ రేట్ కారణంగా తన 75వ సినిమాను ఆయనతో చేయడానికే వెంకటేశ్ మొగ్గుచూపుతున్నాడని మరికొందరు అంటున్నారు. ఏం జరుగుతుందో చూడాలి మరి.





Untitled Document
Advertisements