డేటింగ్ కోసం కక్కుర్తి పడిన 65 ఏళ్ల వృద్ధుడు... అసలు నిజం వెలుగులోకి

     Written by : smtv Desk | Thu, Dec 12, 2019, 12:09 PM

డేటింగ్ కోసం కక్కుర్తి పడిన 65 ఏళ్ల వృద్ధుడు... అసలు నిజం వెలుగులోకి

తనతో డేటింగ్ చేసేందుకు అందమైన అమ్మాయిని పంపిస్తామని చెబితే నమ్మిన ఓ వృద్ధుడు రూ. 73.50 లక్షలు వివిధ ఎకౌంట్లకు బదలీ చేసి మోసపోయిన ఘటన ముంబైలోని ఖర్గార్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. ధిలో జరిగింది. ఈ కేసులో ఓ యువతి, మరో ట్రాన్స్ జెండర్ సహా ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే, 65 సంవత్సరాల ఓ వృద్ధుడికి డేటింగ్ వెబ్ సైట్ లో మెంబర్ షిప్ ఇస్తామని, ఆపై కోరుకున్న ప్రాంతానికి అందమైన అమ్మాయిని పంపిస్తామని స్నేహ అనే యువతి నుంచి ఫోన్ వచ్చింది.

దాన్ని నమ్మిన బాధితుడు 2018లో రిజిస్ట్రేషన్, ఇతర ఫీజులను చెల్లించాడు. లొకాంటో డేటింగ్ సర్వీసెస్ లో స్పీడ్ డేటింగ్ మెంబర్ షిప్ పేరిట మరికొంత డబ్బును వారు నొక్కేశారు. ఆపై డేటింగ్ కు ఎవరినీ పంపక పోవడంతో, తన మెంబర్ షిప్ ను రద్దు చేయాలని అతను కోరాడు. మెంబర్ షిప్ రద్దు కుదరదని తేల్చి చెప్పిన స్నేహ, అమ్మాయిల కోసం తమను డిమాండ్ చేస్తున్నాడని ఆరోపిస్తూ, పోలీసులు కేసు పెట్టింది. ఆపై బాధితుడిని భయపెట్టేలా లీగల్ నోటీసులను పంపించింది.

వారి వైఖరితో ఆందోళన చెందిన వృద్ధుడు, కేసు బయటకు వస్తే, పరువు పోతుందన్న ఉద్దేశంతో వారు చెప్పినంత మొత్తాన్ని చెప్పిన ఖాతాల్లో జమ చేస్తూ వచ్చాడు. వారి వేధింపులు నానాటికీ పెరిగిపోవడంతో ఇక తట్టుకోలేక పోలీసులను ఆశ్రయించాడు. సీనియర్ ఇన్ స్పెక్టర్ ప్రదీప్ తిదార్, కేసును సీరియస్ గా తీసుకుని నిందితుల ఆచూకీని కనిపెట్టారు. ఈ కేసులో స్నేహ అలియాస్ మహీ దాస్ (25), ప్రబీర్ సాహా (35), అర్నబ్ రాయ్ (26)లను అరెస్ట్ చేశామని వెల్లడించారు.





Untitled Document
Advertisements