ఇకపై రాత్రుళ్లు వెలుగు ఉన్న రోడ్లను చూడొచ్చు... గూగుల్ మ్యాప్స్ అప్ డేట్

     Written by : smtv Desk | Thu, Dec 12, 2019, 12:11 PM

ఇకపై రాత్రుళ్లు వెలుగు ఉన్న రోడ్లను చూడొచ్చు... గూగుల్ మ్యాప్స్ అప్ డేట్

ఇప్పటికే ప్రతి ఒక్కరి స్మార్ట్ ఫోన్ లో ఇన్ స్టాల్ అయి, తెలియని ప్రాంతాలకు దారిని చూపిస్తున్న గూగుల్ మ్యాప్స్, ఇప్పుడు ఇంకో మంచి అప్ డేట్ ను కస్టమర్ల ముందుకు తీసుకుని వచ్చింది. మహిళలకు రక్షణగా ఉండటం, ముఖ్యంగా రాత్రుళ్లు ప్రయాణం చేసే వారు క్షేమంగా తమ గమ్యానికి చేరుకునే దిశగా, వెలుగు ఎక్కువగా ఉండే వీధులను ముందే గుర్తించి తెలియజెప్పనుంది. దీని ద్వారా చీకటిగా ఉన్న ప్రాంతాలను తెలుసుకుని, ఆ దిశగా వెళ్లకుండా ముందే జాగ్రత్తలు తీసుకోవచ్చని గూగుల్ పేర్కొంది.

'లైటింగ్' పేరిట ఈ అప్ డేట్ ను ఎక్స్ డీఏ డెవలపర్స్ అభివృద్ధి చేసిందని, వీధి లైట్లు వెలుగుతున్న ప్రాంతాలను ఇది గుర్తించి, మ్యాప్స్ లో చూపుతుందని, లైట్లు ఉన్న వీధులు పసుపు రంగులో కనిపిస్తుంటాయని వెల్లడించింది. గూగుల్ మ్యాప్స్ బీటా వర్షన్ ను అప్ డేట్ చేసుకుని ఈ సదుపాయాన్ని పొందవచ్చని తెలిపింది. ఈ అప్ డేట్ ను పైలట్ ప్రాజెక్టుగా ఇండియాలో ప్రారంభించామని, పరీక్షించి, కస్టమర్ల అభిప్రాయం తెలుసుకున్న తరువాత ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి తెస్తామని పేర్కొంది.





Untitled Document
Advertisements