షాడో బ్యాంకులకు నిబంధనలను సరళతరం చేసిన కేబినేట్

     Written by : smtv Desk | Thu, Dec 12, 2019, 12:15 PM

షాడో బ్యాంకులకు నిబంధనలను సరళతరం చేసిన కేబినేట్

కేంద్రం కేబినెట్ షాడో బ్యాంకులకు నిబంధనలను సరళతరం చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీని ద్వారా ఈ సంస్థలకు మరిన్ని నిధులను అందించి, సహాయం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. షాడో బ్యాంకుల బిబిబి ప్లస్ రేటెడ్ సెక్యూరిటీల కొనుగోలుపై పాక్షికంగా గ్యారెంటీ ఇచ్చేందుకు ప్రభుత్వరంగ బ్యాంకులకు కేంద్రం అనుమతి ఇచ్చింది. ఇంతకుముందు ఎఎ లేదా అధిక రేటింగ్ కల్గిన ఆస్తులకు మాత్రమే గ్యారెంటీ ఉండేది. అయితే ఇప్పుడు వీటితోపాటు బిబిబి ప్లస్ రేటింగ్ ఆస్తులను కూడా స్వీకరించే అవకాశముంటుంది. దీంతో షాడో బ్యాంకులకు సులభంగా రుణాలు ఇచ్చే నిబంధనలను మంత్రివర్గం ఆమోదించింది. ఈ బ్యాంకింగ్ యేతర ఆర్థిక సంస్థల ఆస్తుల 1లక్ష కోట్ల రూపాయల ఆస్తుల కొనుగోలు బ్యాంకులకు పాక్షికంగా హామీ ఇస్తామని ప్రభుత్వం ఈ ఏడాది ప్రారంభంలో ప్రకటించింది. దేశంలో హై గ్రేడ్ స్టీల్ తయారీ సామర్థ్యాలను పెంపొందించడానికి జపాన్‌తో కుదుర్చుకున్న ఒప్పందానికి కేబినెట్ ఆమోదం తెలిపింది.





Untitled Document
Advertisements