స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసిన నోకియా...కేవలం రూ.4,200!

     Written by : smtv Desk | Thu, Dec 12, 2019, 12:26 PM

స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసిన నోకియా...కేవలం రూ.4,200!

నోకియా మరో బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ను తీసుకొచ్చింది. నోకియా సీ1 పేరిట లాంచ్ అయిన ఈ స్మార్ట్ ఫోన్ ఇప్పటివరకు ఫీచర్ ఫోన్ ఉపయోగించి తొలిసారి స్మార్ట్ ఫోన్ వినియోగించాలనుకునే వారి కోసం ఈ ఫోన్ లాంచ్ చేసినట్లు నోకియా తెలిపింది. ఈ ఫోన్ ధరను కెన్యాలో 6,000 షిల్లింగ్ లుగా నిర్ణయించారు. అంటే మన కరెన్సీలో సుమారు రూ.4,200 మాత్రమే. ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్, ఆసియా పసిఫిక్ దేశాల్లో ఫీచర్ ఫోన్లను ఉపయోగించేవారి కోసం దీన్ని ప్రత్యేకంగా రూపొందించినట్లు నోకియా తెలిపింది. నలుపు, ఎరుపు రంగుల్లో ఈ ఫోన్ అందుబాటులో ఉండనుంది. నోకియా పేర్కొన్న మార్కెట్లలో మన దేశం కూడా ఉంది కాబట్టి త్వరలో ఈ ఫోన్ మన దేశంలో కూడా లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇక ఫీచర్ల విషయానికి వస్తే.. నోకియా సీ1 ఆండ్రాయిడ్ 9 Pie(Go Edition)పై పనిచేయనుంది. ఇందులో 5.45 అంగుళాల డిస్ ప్లేను అందించారు. క్వాడ్ కోర్ ప్రాసెసర్ కూడా ఇందులో ఉంది. ఇక మిగతా స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే.. మైక్రో యూఎస్ బీ పోర్ట్, గూగుల్ అసిస్టెంట్ కు ప్రత్యేక బటన్లను ఇందులో అందించారు. కెమెరా విషయానికి వస్తే.. ముందు, వెనక రెండు వైపులా 5 మెగా పిక్సెల్ కెమెరాలను అందించారు. రెండు వైపులా ఫ్లాష్ ను కూడా ఇందులో అందించారు. 2,500 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో అందించారు. ఫీచర్ ఫోన్ల తరహాలోనే ఇందులో బ్యాటరీని బయటకు తీయవచ్చు. 1 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్ ను కూడా ఇందులో అందించారు. మైక్రో ఎస్ డీ కార్డు స్లాట్ ద్వారా 64 జీబీ మెమొరీ కార్డు వరకు ఇందులో వేసుకోవచ్చు. డ్యూయల్ సిమ్ ఫీచర్ కూడా ఇందులో ఉంది. అయితే ఈ ఫోన్ కేవలం 3జీని మాత్రమే సపోర్ట్ చేస్తుంది. 4జీ ఫీచర్ ఇందులో లేదు.







Untitled Document
Advertisements