ఇద్దరు మాజీ ప్రధానులకు జైలు!

     Written by : smtv Desk | Thu, Dec 12, 2019, 03:17 PM

ఇద్దరు మాజీ ప్రధానులకు జైలు!

అల్జీరియా ప్రత్యేక న్యాయస్థానం ప్రజాధనం దుర్వినియోగం, అవినీతి ఆరోపణల కేసులో దోషులుగా తేలిన ఇద్దరు మాజీ ప్రధానులను జైలుశిక్ష, జరిమానా విధించింది. అల్జీరియా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఇలాంటి తరుణంలో కోర్టు తీర్పు వెలువడటంతో మాజీ ప్రధానుల మద్దతుదారులు, పార్టీ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క అవినీతికి పాల్పడిన నేతలకు శిక్ష పడటంతో దేశ ప్రజలంతా సంబురాలు జరుపుకుంటున్నారు. ఆల్జీరియా చీఫ్‌ ప్రాసిక్యూటర్‌ కార్యాలయం వెల్లడించిన వివరాల ప్రకారం.. పలు కార్ల కంపెనీల్లో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి పెట్టుబడుల రూపంలో పెట్టి లాభాలు ఆర్జించినట్టు మాజీ ప్రధానులు అహ్మద్‌ ఔయాహియా, అబ్దెల్‌మాలెక్‌ సెల్లాల్‌లపై మోపిన నేరారోపణలు రుజువయ్యాయి.





Untitled Document
Advertisements