ప్రభుత్వానికి చంద్రబాబు కీలక సూచనలు

     Written by : smtv Desk | Thu, Dec 12, 2019, 03:48 PM

ప్రభుత్వానికి చంద్రబాబు కీలక సూచనలు

ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియానికి టీడీపీ సహకరిస్తుందని ఆ పార్టీ అధినేత చంద్రబాబు అసెంబ్లీలో తెలిపారు. తమ పార్టీ ఎప్పుడూ వ్యతిరేకించలేదన్నారు. అయితే రెండు విషయాల్లో శ్రద్ధ పెట్టాలని ప్రభుత్వానికి సూచించారు. టీచర్లకు సరైన శిక్షణ ఇవ్వాలని, తల్లిదండ్రులకు, విద్యార్థులకు ఐచ్చికంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియానికి బదిలీ అవుతున్న ఈ సంధి పరిస్థితిలో.. పుస్తకాలు కూడా అందుబాటులో ఉండాలని చెప్పారు. అలాగే వాటి భాష విషయంలో ఇబ్బంది లేకుండా.. కంటెంట్, భాష రెండింటిలో సమతూకం ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా భాష ఒక్క విషయంలోనే దృష్టి పెడితే సరిపోదని.. విజ్ఞానం కూడా ఉండాలన్నారు. నాణ్యత, విజ్ఞానం విషయంలో రాజీ పడకూడదని ప్రభుత్వానికి సూచించారు. తెలుగుకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని.. ఆ విషయంలో ఎట్టిపరిస్థితుల్లోనూ వెనకడుగు వేయకూడదన్నారు. మాతృభాషను త్యాగం చేసే పరిస్థితి ఉండకూడదని చంద్రబాబు తన ప్రసంగాన్ని ముగించారు.





Untitled Document
Advertisements