శరీరంలో 32 అడుగుల పురుగు...విసర్జన చేస్తుండగా..!!!

     Written by : smtv Desk | Thu, Dec 12, 2019, 03:49 PM

శరీరంలో 32 అడుగుల పురుగు...విసర్జన చేస్తుండగా..!!!

థాయ్‌లాండ్‌కు చెందిన ఓ వ్యక్తికి ఓ చేదు సంఘటన జరిగింది. సాధారణంగా కడుపులో పురుగులు ఉంటాయంటే ఏదో చిన్న సైజు పురుగులు ఏమోలే, ఏదైనా మందు వేసుకుంటే పోతుందని చాలా మంది పెద్దగా పట్టించుకోరు. కానీ, అన్ని పురుగులు ఒకేలా ఉండవు. ఒక్కోసారి ఇలాంటి పురుగులు కూడా శరీరంలోకి చేరుతాయి. శరీరంలో ఏ భాగంలోనైనా తిష్ట వేయగలవు. మనం తినే ఆహారాన్ని అవి కూడా తింటూ హాయిగా బతికేస్తాయి. థాయ్‌లాండ్‌కు చెందిన ఓ వ్యక్తికి ఇదే జరిగింది. ఈశాన్య థాయ్‌ల్యాండ్‌లోని ఉడన్ థానీ ప్రాంతంలో నివసిస్తున్న క్రిట్సాదా ర్యాట్ప్రాచామ్ అనే 44 ఏళ్ల వ్యక్తి ఇటీవల టాయిలెట్‌కు వెళ్తుండగా కడుపులో ఏదో ఉన్నట్లు అనిపించింది. విసర్జన పూర్తాయినా.. మూత్రాశయాన్ని ఏదో పట్టుకున్నట్లు అనిపించింది. గట్టిగా ప్రయత్నించడంతో మూత్రాసయం నుంచి తాడు లాంటింది కిందికి వేలాడింది. క్రిట్సాదా దాన్ని చేతులతో పట్టుకుని బయటకు లాగడం ప్రారంభించారు. అది లాగే కొద్ది వస్తూనే ఉంది. దీంతో క్రిట్సాదా కలవరపడ్డాడు. కొద్ది సేపటి తర్వాత అది మొత్తం బయటకు వచ్చేసింది. దీంతో క్రిట్సాదా గుండె నిబ్బరం చేసుకుని దాన్ని పరిశీలించాడు. అతడి గర్ల్‌‌ఫ్రెండ్ నర్సు కావడంతో దాన్ని ఫొటో తీసి ఆమెకు పంపాడు. అది టేప్‌వార్మ్ (టేపు తరహాలో ఏలిక పాములా ఉండే పురుగు) అని, శరీర అవయవాల్లో అది పెరుగుతుందని ఆమె చెప్పింది. దీంతో క్రిట్సాదా ఊపిరి పీల్చుకున్నాడు. మూత్రాశయం నుంచి బయటకు వచ్చిన ఆ టేప్‌వార్మ్ పొడవు 32 అడుగులు ఉంది. ఫొటోలు తీసిన తర్వాత అతడు దాన్ని టాయిలెట్‌లోనే పడేసి ఫ్లష్ చేశాడు. టేప్‌వార్మ్ ఫొటోలను ఫేస్‌బుక్‌లో పోస్టు చేశాడు. అకస్మాత్తుగా మీరు బరువు తగ్గుతున్నట్లయితే తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోండి. లేకపోతే.. ఇలాంటి పురుగులు కాపురం పెట్టేస్తాయి.





Untitled Document
Advertisements