బ్యాంక్‌కు వెళ్లకుండానే అకౌంట్ ఫోన్ నెంబర్ మార్చుకోవడం ఎలా?

     Written by : smtv Desk | Thu, Dec 12, 2019, 03:51 PM

బ్యాంక్‌కు వెళ్లకుండానే అకౌంట్ ఫోన్ నెంబర్ మార్చుకోవడం ఎలా?

ప్రభుత్వ రాంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తన కస్టమర్లకు వివిధ రకాల సేవలు అందిస్తోంది. అకౌంట్ ఓపెనింగ్, డిపాజిట్, ఏటీఎం, క్యాష్ విత్‌డ్రా, చెక్ బుక్, లోన్స్ ఇలా ఎన్నో రకాల సర్వీసులు ఆఫర్ చేస్తోంది. స్టేట్ బ్యాంక్ కస్టమర్లు బ్యాంక్‌కు వెళ్లకుండానే చాలా సేవలు పొందొచ్చు. ఎస్‌బీఐ నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ వంటి సర్వీసులు ఇందుకు ఉపయోగపడతాయి.

మొబైల్ నెంబర్ తప్పనిసరి

ఎస్‌బీఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలు పొందాలంటే కచ్చితంగా బ్యాంక్ అకౌంట్‌తో మొబైల్ నెంబర్ రిజిస్టర్ అయ్యి ఉండాలి. లేదంటే ఈ సేవలు పొందటం కుదరదు. ఒకవేళ బ్యాంక్ అకౌంట్‌ మొబైల్ నెంబర్ మార్చేసి ఉంటే.. కొత్త నెంబర్‌ను సులభంగానే అప్‌డేట్ చేసుకోవచ్చు.ఇదివరకు బ్యాంక్ కస్టమర్లు వారి రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌ను అప్‌డేట్ చేసుకోవాలని భావిస్తే.. కచ్చితంగా బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లాల్సి వచ్చేది. అయితే ఇప్పుడు ఆన్‌లైన్‌లోనే పని పూర్తవుతోంది. అకౌంట్ మొబైల్ నెంబర్‌ను ఎస్‌బీఐ ఏటీఎం, ఫోన్ బ్యాంకింగ్ అనే 2 మార్గాల్లో అప్‌డేట్ చేసుకోవచ్చు.

ఎస్‌బీఐ ఏటీఎం ఆప్షన్‌తో:

*దగ్గరిలోని ఎస్‌బీ ఏటీఎం సెంటర్‌కు వెళ్లండి. కార్డు స్వైప్ చేయాలి.
*మెనూ ఆప్షన్‌లో రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ ఎంచుకోండి. ఏటీఎం పిన్ ఎంటర్ చేయాలి. తర్వాత అప్‌డేట్ యువర్ మొబైల్ నెంబర్ ఆప్షన్ ఎంచుకోవాలి.
*ఇప్పుడు పాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ధ్రువీకరించాలి. తర్వాత కొత్త మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి కన్ఫార్మ్ చేయాలి.
*ఇప్పుడు రెండు నెంబర్లకు ఓటీపీ వెళ్తుంది. పాత మొబైల్ నెంబర్ లేకపోతే కొత్త నెంబర్ నుంచి 567676కు ఎస్ఎంఎస్ పంపాలి. పర్సనల్ వివరాల వెరిఫికేషన్ తర్వాత కొత్త మొబైల్ నెంబర్ అప్‌డేట్ అవుతుంది.

ఫోన్ బ్యాంకింగ్ ద్వారా..:

ఫోన్ బ్యాంకింగ్ ద్వారా కూడా రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌ను అప్‌డేట్ చేసుకోవచ్చు. మీరు రిజిస్టర్డ్ ఫోన్ బ్యాంకింగ్ యూజర్ అయితే.. మీరు ఎస్‌బీఐ కాంటాక్ట్ సెంటర్‌కు (1800-11-22-11 or 1800-425-3800) కాల్ చేసి, వారు చెప్పే స్టెప్స్‌ను ఫాలో అవ్వాలి. ఏటీఎం కార్డు వివరాలు, పిన్ నెంబర్, బ్యాంక్ అకౌంట్ సమచారం వంటివి అవసరం అవుతాయి.





Untitled Document
Advertisements