ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చిన కేసీఆర్: కాంగ్రెస్

     Written by : smtv Desk | Thu, Dec 12, 2019, 04:02 PM

ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చిన కేసీఆర్: కాంగ్రెస్

సీఎం కేసీఆర్ అబద్ధాలు, మోసాలతో ఏడాది పాలన సాగించారని కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్‌ మండిపడ్డారు. ధనిక రాష్ట్రాన్ని కేసీఆర్ చేతిలో పెడితే అప్పుల రాష్ట్రంగా మార్చారని దుయ్యబట్టారు. 3.5 లక్షల కోట్ల అప్పు చేసి ఒక్క ఉత్పాదక రంగాన్ని అభివృద్ధి చేయలేదని ధ్వజమెత్తారు. లిక్కర్‌ ఆదాయాన్ని పెంచుకోవడంలో మాత్రం కేసీఆర్‌ ప్రగతి సాధించారని విమర్శించారు. ఎన్నికల హామీలు ఒక్కటి కూడా అమలు చేయలేదని మండిపడ్డారు. విద్యారంగానికి కేవలం 6 శాతం మాత్రమే ఖర్చు చేస్తున్నారని, వైద్య రంగానికి కేవలం 3.5 శాతమే ఖర్చు చేస్తున్నారని తెలిపారు. తెలంగాణ నంబర్‌ వన్‌ అంటూ ప్రజలను మభ్యపెడుతున్నారని దాసోజు శ్రవణ్‌ ఆక్షేపించారు.

Untitled Document
Advertisements