ఈ ఏడాది నమోదైన కేసుల సంఖ్య

     Written by : smtv Desk | Thu, Dec 12, 2019, 04:08 PM

ఈ ఏడాది నమోదైన కేసుల సంఖ్య

గత 5 సంవత్సరాలుగా నగరంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా సైబర్‌ నేరాల పెచ్చు పెరగడంతో వీటి నియంత్రణకై ప్రత్యేక సైబర్‌ నేరాల పోలీస్‌ స్టేషన్‌లను ఏర్పా టు చేయడం జరిగింది. ఇందులో భాగంగా బెంగళూరు నగర కమిషనర్‌ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన సైబర్‌ నేరాల పోలీస్‌ స్టేషన్‌లో జనవరి 2019 నుంచి ఇంత వరకు 9,999 కేసులు నమోదయ్యాయి. అయితే పది వేలవ ఫిర్యాదు నమోదుకు సాంకేతిక సమస్య ఎదురు కావడంతో సైబర్‌ నేరాలకు గురైన బాధితులు తమఫిర్యాదుల నమోదుకు ఏం చే యాలో తెలియక దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.

సైబర్‌క్రైం పోలీస్‌ స్టేషన్‌లో ప్రతిరోజు సగటున 30-40 కేసులు నమోదవుతున్నాయి. వీటిని చేధించడం, నేరస్తులను గుర్తించడం పోలీసులకు సవాల్‌గా మారింది. నగరంలో ఒకే ఒక సైబర్‌ క్రైం స్టేషన్‌ ఉండడంతో 2018లో అప్పటినగర పోలీస్‌ కమిషనర్‌ కమిషనర్‌ పరిధిలోని 8 విభాగాలలో సీఈఎన్‌ (సైబర్‌, ఆర్థిక, డ్రగ్స్‌) స్టేషన్ల ఏర్పాటుకు ప్రభుత్వానికి ప్రతి పాదనలు పంపడం జరిగింది. కేసుల ప రిష్కారంలో జాప్యం అవుతుండడంతో బాధితులు వాపోతున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా 35 సీఈఎన్‌ పోలీస్‌ స్టేషన్లు ఉన్నప్పటికే 90 శాతం ఫిర్యాదులు పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయంలో ఉన్న సైబర్‌ స్టేషన్‌లోనే నమోదవుతున్నట్లు తెలుస్తోంది. లైంగిక వేధింపులు, బ్యాంకు ఖా తాలనుంచి నగదు చోరీ, హ్యాకింగ్‌ వంటి సమస్యలు రోజూ నమోదవుతున్నాయి. ప్రస్తుతం సాంకేతిక సమస్యతో తాత్కాలికంగా ఫిర్యాదులు నమోదవుతున్నాయి.

ప్రస్తుతం సాంకేతిక సమస్యతో తాత్కాలికంగా ఫిర్యాదులు నమోదు నిలిపివేసినట్లు జాయింట్‌ పోలీస్‌ కమిషనర్‌ సం దీప్‌ పాటిల్‌ వెల్లడించారు. స్థానిక పో లీస్‌ స్టేషన్లలో నమోదయ్యే కేసులు పరిష్కారానికి సైబర్‌ క్రైమ్‌ పోలీసులు సహకరిస్తారన్నారు. కేసుల నమోదుకు సం బంధించి 2016లో 7,747, 2017లో 2,697, 2018లో 5,238, 2019లో ఇంత వరకు 9,999 కేసులు నమోదయ్యాయన్నారు.





Untitled Document
Advertisements