ఉల్లి....లొల్లి!!

     Written by : smtv Desk | Thu, Dec 12, 2019, 04:10 PM

ఉల్లి....లొల్లి!!

యూపీలోని గోరఖ్‌పూర్ జిల్లాలో ఒక రిక్షావాలా నుంచి 50 కిలోల ఉల్లిని లూటీ చేసిన ఉదంతం వెలుగు చూసింది. సదరు రిక్షావాలా ఒక హోటల్‌కు ఉల్లిని తరలిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఉల్లి విక్రేత ఫిరోజ్ అహ్మద్ తెలిపిన వివరాల ప్రకారం రిక్షావాలా యమునా మహేవా... మండీలోని కూరగాయలు కొనుగోలు చేసి తీసుకు వెళుతుండాడు. ఈ నేపధ్యంలో గోల్‌ఘర్ లోని ఒక హోటల్ కోసం 50 కిలోల ఉల్లి తీసుకుని రిక్షాలో వెళుతున్నాడు. ఇంతలో మోటార్ సైకిల్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు ఆ రిక్షాను ఆపి, యమునా మహేవాను బెదిరించి, రిక్షాలోని 50 కిలోల ఉల్లిబస్తాను తీసుకుని వెళ్లిపోయారు. ఈ ఉదంతంపై పోలీసు అధికారి వీపీ సింగ్ మాట్లాడుతూ ఉల్లి చోరీ జరిగినట్లు ఫిర్యాదు అందిందని, ఇటువంటి ఫిర్యాదు అందడం ఇదే తొలిసారని అన్నారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

Untitled Document
Advertisements