చెరువులో వయాగ్రా...నీళ్లు తాగి గొర్రెలు నిర్విరామ సెక్స్...?!!

     Written by : smtv Desk | Thu, Dec 12, 2019, 04:25 PM

చెరువులో వయాగ్రా...నీళ్లు తాగి గొర్రెలు నిర్విరామ సెక్స్...?!!

ఎక్కువ సమయం శృంగారంలో పాల్గొనాలంటే వయాగ్రాను తీసుకుంటారు. ఇది పురుషుల కోసం తయారుచేసిన ఔషదం. ఐర్లాండ్‌లోని ఫిజర్ అనే ఫార్మా కంపెనీ ఇటీవల సుమారు 750 టన్నుల శుద్ధి చేయని వయాగ్రాను నదిలో కలిపేసిందట. ఆ నీటిని తాగిన సుమారు 80 వేల గొర్రెలు తాపంతో తహతహలాడాయట. వాటిని అదుపు చేయడం గొర్రెల కాపర్లకు సాధ్యం కాలేదట. కొన్ని గొర్రెలైతే నిర్విరామంగా సెక్స్ చేస్తూనే ఉన్నాయట.ఈ సమాచారం ‘ఇండో-ఏసియా న్యూస్ సర్వీస్’ అనే వార్తా ఏజెన్సీ ద్వారా వ్యాపించింది. అది వైరల్ కావడంతో అంతర్జాతీయ మీడియాతోపాటు ఇండియాలోని పలు ప్రముఖ న్యూస్ వెబ్‌సైట్లు సైతం ఈ వార్తను ప్రచురించాయి. అయితే, గొర్రెలు.. వయాగ్రా కలిసిన నదిలో నీళ్లు తాగడం వాస్తవం కాదని, అది ఓ వ్యంగ్య వార్త మాత్రమేనని తేలింది. వాస్తవానికి ఈ కథనాన్ని ‘వరల్డ్ న్యూస్ డైలీ రిపోర్ట్-WDNR’ అనే వార్తా సంస్థ రాసింది. అయితే, ఈ వార్త కల్పితమని స్పష్టం చేసింది. అయితే, ఏజెన్సీ ద్వారా ఈ వార్త వ్యాపించడం వల్ల ప్రముఖ వార్తా సంస్థలు ఈ విషయాన్ని గుర్తించి ఉండకపోవచ్చని తెలుస్తోంది. ఇది ఫేక్ వార్త అని తెలిసిన తర్వాత వెంటనే దాన్ని ఆయా వెబ్‌సైట్ల నుంచి డిలీట్ చేశారు. ఈ వార్త ప్రస్తుతం తెలుగు వెబ్‌సైట్లలో కూడా వైరల్‌గా చక్కర్లు కొడుతోంది.

Untitled Document
Advertisements