ఐదు కోట్లతో వెబ్ సిరీస్...అది కూడా వారితో!

     Written by : smtv Desk | Thu, Dec 12, 2019, 04:44 PM

ఐదు కోట్లతో వెబ్ సిరీస్...అది కూడా వారితో!

‘ఎన్టీఆర్’ బయోపిక్ ఫ్లాప్ , ‘మణికర్ణిక’ సినిమా వల్ల బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌తో గొడవ జరగడంతో ప్రముఖ దర్శకుడు క్రిష్ బాగా డిస్టర్బ్ అయ్యారు. ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని క్రిష్ కసితో ఉన్నారు. అందుకే కాస్త కొత్తగా వెబ్ సిరీస్‌ చేయాలని అనుకున్నారు. అయితే ఈ వెబ్ సిరీస్‌కి డైరెక్షన్ చేయడం కంటే నిర్మాతగా వ్యవహరించడం మంచిదని అనుకున్నారేమో.‘ఎన్టీఆర్: కథానాయకుడు’, ‘ఎన్టీఆర్: మహానాయకుడు’ సినిమాలు ఊహించని విధంగా ఫ్లాప్ అయ్యాయి. ఈ బయోపిక్ తెరకెక్కిస్తున్నప్పుడే క్రిష్ బాలీవుడ్‌లో కంగనా రనౌత్‌తో ‘మణికర్ణిక’ సినిమాతో బిజీగా ఉన్నారు. దాంతో రెండు సినిమాలను చూసుకోలేకపోయారు. అదీకాకుండా స్క్రిప్ట్‌లో మార్పులు చేయాలని కంగన అనడంతో క్రిష్‌కి కోపం వచ్చింది. దాంతో ఆయన సగం సినిమా తీసి మొత్తానికే సినిమా నుంచి తప్పుకున్నారు. కానీ ఆయన తెరకెక్కించిన ‘ఎన్టీఆర్’ బయోపిక్ ఫ్లాప్ అయింది. ఈసారి ఎలాగైనా మంచి హిట్ కొట్టాలని పవన్ కళ్యాణ్‌కి, రామ్ చరణ్‌కి కథలు వినిపించారట క్రిష్. కానీ వాళ్లు రిస్క్ తీసుకోదలచుకోలేదు. అందుకే తర్వాత చూద్దామని పక్కన పెట్టారట.ఇదిలా ఉండగా క్రిష్ వెబ్ సిరీస్‌ తీయాలన్న నిర్ణయానికి వచ్చారు. ప్రస్తుతం డైరెక్ట్ చేసే మూడ్‌లో లేని క్రిష్ నిర్మాతగా వ్యవహరించాలని అనుకున్నట్లు తెలుస్తోంది. తన వెబ్ సిరీస్‌లో అవకాశాల కోసం స్ట్రగుల్ అవుతున్న నవదీప్, బిందు మాధవి, హెబ్బా పటేల్, తేజశ్వి మడివాడలను ఎంపిక చేసుకున్నారట. ఓ కామెడీ కాన్సెప్ట్‌తో ఈ వెబ్ సిరీస్‌ను నిర్మించనున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిని డైరెక్ట్ చేసే ఛాన్స్‌ను ‘దడ’ సినిమాతో నాగచైతన్యకు ఫ్లాప్ ఇచ్చిన డైరెక్టర్ అజయ్ భుయాన్‌కు ఇచ్చినట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం.ఈ వెబ్ సిరీస్‌ను క్రిష్ ఐదు కోట్ల రూపాయలు పెట్టి తెరకెక్కిస్తున్నట్లు ఫిలిం వర్గాల సమాచారం. ఫాంలో లేని నటులను, ఒక్క హిట్ కూడా ఇవ్వలేని దర్శకుడిని పెట్టుకుని క్రిష్ రిస్క్ తీసుకుంటున్నాడనే చెప్పాలి. అసలే క్రిష్‌కు ప్రస్తుతం అవకాశాలు రావడంలేదు. ఇలాంటి టైంలో అంత డబ్బు పెట్టి వెబ్ సిరీస్ చేయడం ఎంత వరకు మంచిదో ఆయనకే తెలియాలి. ఇప్పటికే ఈ వెబ్ సిరీస్ షూటింగ్ మొదలైపోయినట్లు తెలుస్తోంది.

Untitled Document
Advertisements