అసలైన ఛాంపియన్‌..ఎంతో మందికి ఆదర్శం!

     Written by : smtv Desk | Thu, Dec 12, 2019, 05:15 PM

అసలైన ఛాంపియన్‌..ఎంతో మందికి ఆదర్శం!

టీమిండియా సిక్సర్ల వీరుడు, మాజీ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌సింగ్‌ గురువారం(డిసెంబర్ 12) తన 38వ ఏట అడుగుపెట్టారు. ఈ నేపథ్యంలో సోషల్‌ మీడియాలో అతడికి పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ కమిటీ(ఐసిసి), బిసిసిఐ, క్రికెటర్లు, అతడి అభిమానులు పెద్ద ఎత్తున్న శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఐసిసి తన ట్విట్టర్‌ అధికారిక ఖాతా ద్వారా యువీకి శుభాకాంక్షలు తెలిపింది. అందులో అతడు ఓకే ఓవర్‌లో ఆరు సిక్సులు బాదిన వీడియోను పోస్టు చేసింది. అసలైన ఛాంపియన్‌వి నువ్వు ఎంతో మందికి ఆదర్శం. జన్మదిన శుభాకాంక్షలు యువరాజ్‌ అంటూ బిసిసిఐ ట్వీట్‌ చేసింది.

Untitled Document
Advertisements