దీక్షలో ఉండగానే సినిమా షూట్ స్టార్ చేసిన పవన్!

     Written by : smtv Desk | Thu, Dec 12, 2019, 06:07 PM

దీక్షలో ఉండగానే సినిమా షూట్ స్టార్ చేసిన పవన్!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిరిగి సిల్వర్‌ స్క్రీన్‌ రీ ఎంట్రీ ఇస్తారన్న ప్రచారం చాలా కాలంగా జరుగుతోంది. పవన్‌ అధికారికంగా ఎలాంటి ప్రకటనా చేయకపోయినా.. పింక్‌ రీమేక్‌తో పవన్‌ రీ ఎంట్రీ ఇస్తున్నారన్న టాక్‌ టాలీవుడ్ సర్కిల్స్‌లో బలంగా వినిపిస్తోంది.అయితే గురువారం ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైనట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాను బోనీకపూర్‌తో కలిసి దిల్ రాజునిర్మిస్తున్నాడు. ఈ సినిమాను వేణు శ్రీరామ్‌ దర్శకత్వం వహించనున్నాడు. ఈ రోజు ఈ సినిమా ఎస్వీసీ ఆఫీస్‌లో లాంఛనంగా ప్రారంభమైంది.అయితే ఈ రోజు పవన్‌ కళ్యాన్ కాకినాడలో రైతు సౌభాగ్య దీక్షలో పాల్గొంటున్నాడు. దీంతో పవన్‌ లేకుండానే సినిమాను ప్రారంభించారు చిత్రయూనిట్‌. ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్ జనవరిలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. సినిమా కోసం పవన్‌ కేవలం 20 రోజులు మాత్రమే డేట్స్‌ ఇచ్చినట్టుగా ప్రచారం జరుగుతోంది. అందుకు తగ్గట్టుగా షెడ్యూల్‌ ప్లాన్ చేసిన చిత్రయూనిట్‌ ఫిబ్రవరిలో పవన్‌ సీన్స్‌ను చిత్రీకరించేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. అమితాబ్‌ బచ్చన్, తాప్సీ లీడ్‌ రోల్స్‌లో తెరకెక్కిన పింక్‌ సినిమాను తమిళ్‌లో అజిత్ శ్రద్ధా శ్రీనాథ్‌లు లీడ్‌ రోల్స్‌లో రీమేక్‌ చేశారు. ఇప్పుడు అదే సినిమాను తెలుగులో పవన్‌ కళ్యాణ్ లీడ్‌ రోల్‌లో రీమేక్ చేస్తుండగా తాప్సీ, శ్రద్ధా పోషించిన పాత్రలో నివేదా థామస్‌ నటించనుందని తెలుస్తోంది.Untitled Document
Advertisements