ప్రేమకు ఒప్పుకోలేదు...యువతికి బస్సులోనే తాళి కట్టాడు

     Written by : smtv Desk | Thu, Dec 12, 2019, 06:43 PM

ప్రేమకు ఒప్పుకోలేదు...యువతికి బస్సులోనే తాళి కట్టాడు

ప్రేమను తిరస్కరించిందన్న కోపంతో ఓ యువకుడు బస్సులోనే యువతికి తాళి కట్టాడు. ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. అంబూరు సమీపంలోని సాండ్రోర్ కుప్పం ప్రాంతానికి చెందిన జగన్ అనే యువకుడు స్థానిక కాలేజీలో చదువుతున్న యువతిని ప్రేమ పేరుతో కొన్నాళ్లుగా వేధిస్తున్నాడు. అయితే తనకిష్టం లేదని ఆ యువతి అతడి ప్రేమను తిరస్కరిస్తూ వస్తోంది. ఇటీవల ఆమెకు తల్లిదండ్రులు ఓ వ్యక్తితో పెళ్లి నిశ్చయించారు. ఈ విషయం తెలుసుకున్న జగన్ మంగళవారం ఆమెను వెంబడించాడు. ఈ క్రమంలోనే యువతి ఆంబూరు నుంచి వాణియంబాడికి వెళ్లేందుకు బస్సు ఎక్కింది. దీన్ని గమనించిన జగన్ అదే బస్సు ఎక్కి యువతి వెనుక సీట్లో కూర్చున్నాడు. కొంతదూరం వెళ్లాక జేబులో నుంచి తాళి తీసి వెనుక నుంచి యువతి మెడలో కట్టేశాడు. యువతి కేకలు వేయడంతో తోటి ప్రయాణికులు నిందితుడిని పట్టుకుని బస్సులోనే దేహశుద్ధి చేశారు. దీనిపై సమాచారం అందుకున్న వాణియంబాడి పోలీసులు జగన్‌పై కేసు నమోదు చేసుకుని అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


Untitled Document
Advertisements