రెండు 5జీ ఫోన్లను లాంచ్ చేయనున్న ఒప్పో

     Written by : smtv Desk | Thu, Dec 12, 2019, 06:48 PM

రెండు 5జీ ఫోన్లను లాంచ్ చేయనున్న ఒప్పో

ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ ఒప్పో తాజాగా మరో రెండు ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేసేందుకు సిద్దమవుతుంది. డిసెంబర్ 26న చైనాలో ఒప్పో రెనో 3, రెనో 3 ప్రో ఫోన్లు లాంచ్ కానున్నాయి. విశేషం ఏంటంటే.. ఈ రెండూ 5జీ ఫోన్లు కావడం విశేషం. అయితే వీటిని 5జీ టెక్నాలజీతో లాంచ్ చేయనున్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే టీజర్ల ద్వారా తెలిపారు. దీంతో ఫ్లాగ్ షిప్ లో ఇప్పటికే నిలదొక్కుకున్న వన్ ప్లస్ కు ఒప్పోకు పోటీ ఇచ్చే అవకాశం ఉంది. ఇక ధర విషయానికి వస్తే.. ఇప్పటివరకు వచ్చిన లీకుల ప్రకారం రెనో 3 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ధర 3,299 యువాన్లుగా(సుమారు రూ.33,200) ఉండనుంది. 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 3,599 యువాన్లుగా(సుమారు రూ.36,200) ఉండనున్నట్లు తెలిసింది. రెనో 3 ప్రోకు సంబంధించిన ధర వివరాలు తెలియాల్సి ఉంది. ఇప్పటివరకు లీకైన స్పెసిఫికేషన్ల ప్రకారం చూస్తే.. ఇందులో 6.5 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ అమోఎల్ఈడీ(AMOLED) డిస్ ప్లేను అందించనున్నారు. స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్ గా ఉండనుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 6 ప్రొటెక్షన్, ఇన్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ వంటి ఫ్లాగ్ షిప్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. స్క్రీన్ తో పాటు ఫోన్ వెనకభాగంలో కూడా గొరిల్లా గ్లాస్ అందించనున్నట్లు తెలుస్తోంది. బ్యాటరీ సామర్థ్యం 4,500 ఎంఏహెచ్ గా ఉండనుంది. VOOC 4.0 ఫాస్ట్ చార్జ్ ఫీచర్ కూడా ఇందులో అందించనున్నారు. ఒప్పో రెనో 3లో క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 735 ప్రాసెసర్ ను ఉపయోగించనున్నట్లు తెలుస్తోంది. ఇక అత్యంత ముఖ్యమైన కెమెరాల విషయానికి వస్తే.. వెనకవైపు 48 మెగా పిక్సెల్, 8 మెగా పిక్సెల్, 2 మెగా పిక్సెల్, 2 మెగా పిక్సెల్ సామర్థ్యమున్న నాలుగు కెమెరాలు ఉండనున్నట్లు తెలుస్తోంది. 32 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరాను కూడా ఇందులో అందించనున్నారు. రెనో 3 ప్రో వెర్షన్లో క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 765G ప్రాసెసర్ ను వినియోగించనున్నట్లు సమాచారం. ఇందులో వెనకవైపు 48 మెగా పిక్సెల్, 13 మెగా పిక్సెల్, 8 మెగా పిక్సెల్, 2 మెగా పిక్సెల్ కెమెరాలు ఉంటాయని లీకులు చెబుతున్నాయి.
Untitled Document
Advertisements