పెళ్లి ప్రయత్నాల్లో ఆటంకాలు...ఎందుకో తెలుసా?

     Written by : smtv Desk | Thu, Dec 12, 2019, 07:19 PM

పెళ్లి ప్రయత్నాల్లో ఆటంకాలు...ఎందుకో తెలుసా?

సాధారణంగా యుక్త వ‌య‌సులోకి వ‌చ్చిన‌ ప్ర‌తి ఒక్కళ్లూ తన ఎప్పుడు పెళ్లి జరుగుతుందనే ఆలోచ‌న మొద‌ల‌వుతుంది. అయితే, అనుకున్న స‌మ‌యంలో కొందరికి వివాహం జరగక ఓ స‌మ‌స్య‌గా పరిణమిస్తుంది. కానీ, జాత‌కం ప్రకారమే వివాహ స‌మ‌యం నిర్థేశించ‌బ‌డుతుంద‌ని జ్యోతిషులు పేర్కొంటారు. 22 ఏళ్లలోపు జరిగితే శీఘ్ర వివాహం, 28 ఏళ్లు దాటిన తర్వాత జరిగేవి ఆలస్య వివాహం. జాతకంలోని లగ్నం, సప్తమభావాలలో శుభ గ్రహాలు ఉండి సప్తమాధిపతి పాప గ్రహాలతో కలవకుండా శుభగ్రహాల దృష్టి పొందడం, శుక్రుడు బలంగా ఉన్నప్పుడు అంటే మిథున, తుల, వృషభ రాశులు, రవికి 150 లకుపైగా దూరంగా ఉన్నప్పుడు. శుక్రుడు, శనిన చంద్రుని దృష్టి పడని సందర్భాలు. శుభ గ్రహాలు వక్రగతి పొందకుండా ఉన్నప్పుడు. ద్వితీయ అష్టమ స్థానాలలో శుభ గ్రహాలు ఉన్నా లేదా జ‌లతత్వ రాశులలో శుభగ్రాహాలు ఉన్నప్పుడు శీఘ్రంగా వివాహాలు జరుగుతాయి. అలాగే, లగ్నం, సప్తమ స్థానంలో పాప గ్రహాలైన శని, రాహు, కేతువు, రవి, కుజలు ఉన్నా, సప్తమ స్థానంలో రెండు లేదా అంతకంటే ఎక్కువ పాపగ్రహాలు ఉన్నా వివాహం ఆలస్యమవుతుంది. ద్వితీయ అష్టమ భావంలో పాపగ్రహాలు, వక్రాలు ఉండటం, శుక్రుడు రాహువు, శనితో కలిసి ఉన్నా లేదా రవికి శుక్రుడు 430 201 కన్నా ఎక్కువ దూరంలో ఉన్నప్పుడు పెళ్లికి ఆటంకాలు ఏర్పడతాయి. జాతకంలో ఎక్కువ గ్రహాలు నీచం లేదా వక్రించి ఉన్నప్పుడు, సప్తమ భావం, సప్తమాధిపై పాప గ్రహాల ప్రభావం ఎక్కువగా ఉన్నప్పుడు ఆలస్యంగా వివాహాలు జరుగుతాయి. వివాహకాలం నిర్ణయించడానికి ఆ వ్యక్తి 21కి ఏళ్లు దాటిన తర్వాత వచ్చే దశ అంతర్దశలను పరిశీలిస్తారు. జాతక చక్రం పరిశీలించేటప్పుడు ఆలస్య వివాహానికి కారణాలు తెలుసుకుని సంబంధిత గ్రహానికి పరిహారం చేయాలని, అప్పుడే దోషాలు తొలగి శ్రీఘ్ర వివాహం జరుగుతుందని పండితులు పేర్కొంటున్నారు. సప్తమ స్థానంపై రాహు, కేతువుల ప్రభావం ఉంటే ఎన్ని సంబంధాలు వచ్చినా ఫ‌లితం ఉండ‌దట. కొన్ని సందర్భాల్లో నిశ్చితార్ధం జరిగిన తరువాత కూడా ఏవో కారణాల వల్ల వివాహం వాయిదా పడుతుందట. ఇలాంటి వారు కనక దుర్గమ్మకు 8 శుక్రవారాలు కుంకుమార్చన జరిపిస్తే దోషాలు తొల‌గిపోతాయి. వివాహం విషయంలో ఎదురువుతున్న ఆటంకాలు తొలిగిపోవాలంటే 8 మంగళవారాలు ఆంజనేయ స్వామికి 108 తమల పాకులతో అర్చన జరిపిస్తే ఫలితం ఉంటుంది. శని దోషం వల్ల వివాహం ఆలస్యమైతే తమల పాకులలో తేనె వేసి నల్ల చీమలకు ఆహారంగా పెట్టాలట. అలాగే ఏదో ఒక కారణం వల్ల వివాహం ఆలస్యం అవుతుంటే ‘దేవీంద్రాణి నమస్తుభ్యం దేవేంద్ర ప్రియభాషిణి సర్వ సౌభాగ్య కార్యేషు సర్వ సౌభాగ్యదాయినీ’ మంత్రాన్ని 108 సార్లు పారాయణం చేయాలి.

Untitled Document
Advertisements