ఐపీఎల్ 2020: వేలం నుంచి 639 మంది క్రికెటర్లు ఔట్

     Written by : smtv Desk | Thu, Dec 12, 2019, 07:58 PM

ఐపీఎల్ 2020: వేలం నుంచి 639 మంది క్రికెటర్లు ఔట్

కోల్‌కతా వేదికగా ఈ నెల 19న ఐపీఎల్ 2020 సీజన్ వేలం జరగనుండగా.. టోర్నీలోని ఎనిమిది ఫ్రాంఛైజీలు కలిపి మొత్తం 73 మందిని మాత్రమే కొనుగోలు చేసే వెసులబాటు ఉంది. కానీ.. ఏకంగా 971 మంది క్రికెటర్లు వేలానికి రిజస్టర్ చేసుకున్నారు. దీంతో.. ఆటగాళ్ల అర్హత, ప్రమాణాల ఆధారంగా జాబితాని తాజాగా 332 మందికి కుదించారు. దీంతో.. 639 మంది క్రికెటర్లు రేసు నుంచి తప్పుకున్నారు.జాబితాలో మిగిలిన 332 మంది క్రికెటర్లలో భారత్ నుంచి 44 మంది క్రికెటర్లు వేలంలో నిలవగా.. మిగిలిన అందరూ విదేశీ క్రికెటర్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక వేలంలో 8 టీమ్స్ కొనుగోలు చేయబోతున్న 73 మందిలో 29 మంది విదేశీ క్రికెటర్లు ఉండనున్నారు. భారత్ నుంచి వేలంలో ఉన్న క్రికెటర్లలో రాబిన్ ఉతప్ప, జయదేవ్ ఉనద్కత్ మంచి ధర పలికే సూచనలు కనిపిస్తున్నాయి. గత ఏడాది కోల్‌కతా నైట్‌రైడర్స్‌కి ఆడిన రాబిన్ ఉతప్ప ఈసారి వేలానికి రూ. 1.5 కోట్ల కనీస ధరతో వస్తుండగా.. గత ఏడాది రూ. 8.4 కోట్లకి రాజస్థాన్ రాయల్స్‌కి అమ్ముడుపోయిన జయదేవ్ ఈసారి రూ. కోటితో వేలంలోకి వస్తున్నాడు.విదేశీ క్రికెటర్లలో గ్లెన్ మాక్స్‌వెల్, క్రిస్‌లిన్, డేల్ స్టెయిన్, అరోన్ ఫించ్, పాట్ కమిన్స్, మిచెల్ మార్ష్, జేసన్ రాయ్, ఇయాన్ మోర్గాన్, క్రిస్ మోరీస్ తదితరులు భారీ ధర పలికే అవకాశం ఉంది. ముఖ్యంగా.. విధ్వంసక ఓపెనర్ క్రిస్‌లిన్, మాక్స్‌వెల్‌పై అన్ని ఫ్రాంఛైజీలు ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నాయి. వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి నుంచి ఐపీఎల్ 2020 సీజన్ మ్యాచ్‌లు ప్రారంభంకానున్నాయి.









Untitled Document
Advertisements