మీ జుట్టు ఆరోగ్య౦గా లేదా..? ఐతే చదవండి

     Written by : smtv Desk | Mon, Nov 06, 2017, 06:42 PM

మీ జుట్టు ఆరోగ్య౦గా  లేదా..? ఐతే చదవండి

హైదరాబాద్, నవంబర్ 06: రోజురోజుకు పెరుగుతున్న కాలుష్యం మూలంగా ప్రతి వారిలో జుట్టు సంబంధిత సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి.
ఈ సమస్యకు ఆహారపు అలవాట్లు కూడా ముఖ్య కారణం. మీ జుట్టు ఆరోగ్యంగా, అందంగా ఉండాలంటే తరచూ చేపల్ని తినడం మంచిది. చేపల్లో మాంసకృత్తులు సమృద్ధిగా ఉండి, జుట్టుకు పోషణ అందించే ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలను అందిస్తుంది. బాదం, వాల్‌నట్‌, జీడిపప్పూ, గుమ్మడి, పొద్దుతిరుగుడు వంటి విత్తనాల్లో కూడా ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు ఎక్కువగా లభిస్తాయి. అలానే వీటిలోని విటమిన్‌ ఇ, బయోటిన్‌లు జుట్టుకి రక్షణనిచ్చి, జుట్టును రాలకుండా నియంత్రిస్తాయి.

వాల్‌నట్స్‌లో ఉండే జింక్‌ జుట్టుకి సహజమైన రంగునూ, తేమనూ అందించి నిగనిగలాడేలా చేస్తుంది. ఇక జుట్టు ఆరోగ్యంగా ఎదిగేలా చేయడంలో ఆకుకూరలు ఎంతో కీలకం. వీటిలో ఇనుము ఎక్కువగా ఉంటుంది. ఇది వెంట్రుకలు చిట్లకుండా, పెళుసుగా మారకుండా నిరోధిస్తుంది. విటమిన్‌ ఎ ఎక్కువగా ఉండే క్యారట్‌‌, చిలగడ దుంపలు, గుమ్మడి, మామిడి పండ్లను ఎక్కువగా తీసుకోవాలి. విటమిన్‌ ఎ లోపం వల్ల మాడు ఎండిపోయినట్లు, చుండ్రు సమస్య కూడా కనిపిస్తుంది. మీగడ తీసిన పాలూ, చీజ్‌ కూడా వెంట్రుకలు చిట్లి పోకుండా కాపాడతాయి.





Untitled Document
Advertisements