అమెజాన్‌ వెబ్‌సైట్‌లో వినాయకుడు, శివుడు, ఓంకారం గుర్తులతో డోర్‌మ్యాట్లు..

     Written by : smtv Desk | Mon, Jan 13, 2020, 11:04 AM

ఈ కామర్స్ సంస్థ అమెజాన్.. హిందువుల మత విశ్వాసాలను అపహాస్యం చేసింది. నిత్యం పూజించే దేవుళ్ల చిత్రాలను… కాలి కింద వేసుకునే డోర్ మ్యాట్లు, బాత్రూం రగ్స్‌పై ముద్రించి అమ్మకానికి పెట్టింది. అమెజాన్‌ వెబ్‌సైట్‌లో వినాయకుడు, శివుడు, ఓంకారం గుర్తులతో డోర్‌మ్యాట్లు, బాత్రూం రగ్స్‌ దర్శనమిచ్చాయి. వీటితోపాటు భారత జాతీయ జెండాతో కూడిన డోర్‌మ్యాట్స్‌ కనిపించాయి. దీంతో భారత వినియోగదారులు అమెజాన్‌ సంస్థపై ఆగ్రహంతో విరుచుకుపడ్డారు. నెటిజన్లు అమెజాన్‌పై నిప్పులు చెరిగారు. ప్రస్తుతం ట్విటర్‌లో బాయ్‌కాట్‌ అమెజాన్‌ అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్‌లో నిలిచింది. సంస్కృతిని గౌరవించడం తెలీకపోయినా అవమానించడం మానుకోండంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Untitled Document
Advertisements