బోనెక్కిన బంధం...లేదా మరోమార్గం?

     Written by : smtv Desk | Thu, Nov 09, 2017, 07:02 PM

బోనెక్కిన బంధం...లేదా మరోమార్గం?

హైదరాబాద్, నవంబర్ 09: పంచభూతాలు, వేదమంత్రాలు, బంధుమిత్రుల సాక్షిగా ఒక్కటైన ఏడడుగుల బంధం పటాపంచలు కావడానికి ఎక్కువ సమయం పట్టడ౦లేదు. సుఖసంతోషాలతో నిండా నూరేళ్లు వర్ధిల్లాల్సిన వివాహబంధం మధ్యలోనే తెగిపోతుంది. పెళ్లి సంస్కారమని, మానవజాతి కొనసాగింపునకు మూలమని మానవధర్మం పెళ్ళికి పెద్దపీట వేసింది. కానీ ఇటీవల విడాకుల కేసుల సంఖ్య పెరగడంపై సుప్రీంకోర్ట్ ఆందోళన వ్యక్తం చేసింది. దీనిపై స్పందించిన సుప్రీంకోర్ట్ ధర్మాసనం భార్యాభర్తల్లో అవగాహనలేమి కారణంగా పెళ్లిళ్లు పెటాకులు కావడాన్ని తీవ్రంగా ఆక్షెపి౦చి౦ది. విద్యావంతులైన భార్యాభర్తలు చిన్న కారణాలకు కోర్టు మెట్లు ఎక్కుతున్నారు. వేగంగా మారిపోతున్న మానవ సంబంధాలు కుటుంబ విలువలను ఎక్కడికి తీసుకువేల్తున్నాయో అర్ధం కానీ పరిస్థితి. పదేళ్ల క్రితం వెయ్యిలో ఒక పెళ్లి విడాకులతో ముగిస్తే, నేడు అది 13 కి చేరింది. భారత్ లో ఇప్పటి వరకు సుమారు 8.5 లక్షల మంది కోర్ట్ ద్వారా విడాకులు తీసుకొంటే, అందులో సుమారు 5 లక్షల మంది గ్రామీణ దంపతులే. ఇంకా పరస్పర అంగీకారంతో విడిపోయే జంటలకు కొదవేలేదు. బంధాలకు నెలవైన గ్రామాల్లో కూడా ఈ విష సంస్కృతి వ్యాపించడం ఆందోళనకర విషయం. 'క్రూర ప్రవర్తన' అనే అంశం ఆధారంగా ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయి.
యువతీ యువకుల్లో పెరుగుతున్న వ్యక్తిస్వేచ్ఛ, అభద్రతా భావ౦, అవగాహనా రాహిత్యం, ప్రతి అభిప్రాయ భేదాన్ని భూతద్దంలో చూడడం వల్లే ఇటువంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని పలు సందర్భాల్లో కోర్ట్ వ్యాఖ్యానించింది. ఇటీవల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ముస్లిం సాంప్రదాయ 'తలాక్' ను రద్దుచేయడం వంటిది, ఇంకా కోర్ట్ తీసుకునే అనేక చర్యలు భారతీయ సమిష్టి కుటుంబ వ్యవస్థను పదికాలాలపాటు పదిలం చేయాలనుకోడానికి నిదర్శనం. రాజీమార్గం, కౌన్సిలింగ్ కేంద్రాలు ఉన్నా అవి ఫలిస్తున్న జాడ కనిపించుట లేదు. పరస్పర విశ్వాసంతో వివాహబంధాన్ని కాపాడు కోవాలని న్యాయ నిపుణులు సూచిస్తున్నారు.





Untitled Document
Advertisements