నిర్భయ దోషులకు సుప్రీం కోర్టు షాక్…

     Written by : smtv Desk | Tue, Jan 14, 2020, 04:01 PM

నిర్భయ కేసు దోషులకు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. ఉరిశిక్షపై ఇద్దరు నిందితులు దాఖలు చేసిన క్యూరేటివ్ పిటిషన్‌ను ధర్మాసనం కొట్టివేసింది. క్షమాభిక్ష కోసం ఇద్దరు నిందితులు ముఖేశ్, వినయ్‌లు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై విచారించిన ఐదుగురు సభ్యులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం… కొట్టివేసింది. దోషులపై జాలీ చూపాల్సిన అవసరం లేదని సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది. బెంచ్‌లో ఎన్వీ రమణ, అరుణ్ మిశ్ర, ఆర్ఎఫ్ నారిమన్, ఆర్ భానుమతి, అశోక్ భూషన్ న్యాయమూర్తులుగా ఉన్నారు.

కాగా, 2012లో నిర్భయపై సామూహిక అత్యాచారం చేసి, చంపిన నేరస్థులు ముకేష్ (32), పవన్ గుప్తా (25), వినయ్ శర్మ (26), అక్షయ్‌కుమార్ సింగ్ (31)లను జనవరి 22 ఉదయం 7 గంటలకు తీహార్ జైల్లో ఉరితీయాలని పాటియాల కోర్టు ఆదేశించింది. పాటియాల కోర్టు తీర్పుపై ఇద్దరు దోషులు సుప్రీంలో క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేయగా… వాటిని ధర్మాసనం కొట్టివేసింది. సుప్రీం కోర్టు తాజా తీర్పుతో… ఈ నెల 22న ఉదయం 7 గంటలకు నలుగురు నిందితులకు తీహార్‌ జైల్‌లో ఉరి తీయనున్నారు. ఇప్పటికే జైలు అధికారులు ఉరికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేశారు.





Untitled Document
Advertisements