ద్విచక్ర వాహనంపై ప్రయాణించే ఇద్దరు హెల్మెట్ ధరించాల్సిందే

     Written by : smtv Desk | Tue, Jan 14, 2020, 07:09 PM

హైదరాబాద్ : నగరంలో ద్విచక్ర వాహనాలపై వెళ్లుతున్న వ్యక్తులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని నగర ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. దీనివల్ల ప్రమాదాల బారినపడ మృతిచెందుతున్న వారి సంఖ్య గణనీయంగా తగ్గించవచ్చంటున్నారు. మంగళవారం ఒక ప్రకటనలో వారు పేర్కొంటూ ఇప్పటికే కర్ణాటక రాష్ట్రంలో ఈనిబంధనలు అమలుల్లో ఉందని, తెలంగాణలో కూడా ద్విచక్ర వాహనాలనై ఇద్దరు వెళ్లుతుంటే తప్పనిసరిగా హెల్మెట్ ధరించే విధానం తీసుకొస్తామని వెల్లడిస్తున్నారు. డిజిపి ఆదేశాల మేరకు మూడు కమిషనరేట్ల పరిధిలో ద్విచక్ర వాహనాలపై వెళ్లుతున్న ఇద్దరు హెల్మెట్ పెట్టుకోవాలని ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు.

లేకపోతే కేసులు నమోదు చేసి జరిమానా విధిస్తున్నామని, ఈచలానాలు ఇంటికి పంపిస్తున్నట్లు, అందుకోసం వాహనదారులు లిప్టు ఇచ్చేటప్పడు ఆలోచించాలని హెచ్చరిస్తున్నారు. ద్విచక్ర వాహనంపై వెళ్లుతున్న ఇద్దరు హెల్మెట్ ధరించడం వల్ల తప్పనిసరిగా చేసిన రాచకొండ కమిషనరేట్ పోలీసులు ఈనెల 7వ తేదీ నుంచి కేసులు నమోదు చేసి, జరిమానాలు విధిస్తున్నారు. సైబారాబాద్ కమిషనరేట్ పరిధిలో మంగళవారం నుంచి ఈనిబంధనలు అమలు చేస్తున్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. రాచకొండ ట్రాఫిక్ పోలీసులు 7 రోజుల్లో 263మందిపై ద్విచక్ర వాహనదారులపై కేసులు నమోదు చేసి రూ. 28,400 జరిమానాలు విధించారు. భార్యభర్తలు బైక్ వెళ్లుతున్నప్పుడు వెనక కూర్చున్న వ్యక్తికి హెల్మెట్ లేదని జరిమానా విధిసే ఎలా అని వాహనదారులు వాపోతున్నారు.





Untitled Document
Advertisements