ధవన్ హాఫ్ సెంచరీ

     Written by : smtv Desk | Tue, Jan 14, 2020, 07:12 PM

ముంబయి: మూడు వన్డేల సిరీస్ లో భాగంగా వాంఖడే స్టేడియం వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డేలో భారత్ నిలకడగా ఆడుతోంది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. స్టార్ ఓపెనర్, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ(10) జట్టు స్కోరు 13 పరుగుల వద్దే పెవిలియన్ చేరాడు. అనంతరం వచ్చిన కెఎల్ రాహుల్ తో కలిసి మరో ఓపెనర్ శిఖర్ ధవన్ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలో ధవన్ హాఫ్ సెంచరీ కూడా పూర్తి చేసుకున్నాడు. రాహుల్, ధవన్ లు ఇద్దరు మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతూ.. చెత్త బంతులను బౌండరీలుగా మలుస్తూ జట్టుకు భారీ భాగస్వామ్యాన్ని అందించారు. ప్రస్తుతం టీమిండియా 27 ఓవర్లు ముగిసేసరికి ఒక వికెట్ నష్టానికి 134 పరుగులు సాధించింది. క్రీజులో శిఖర్(73), రాహుల్(47)లు ఉన్నారు.

Untitled Document
Advertisements