ఐదు రోజుల్లో 5000కి పైగా ఒంటెలను సంహరించారు

     Written by : smtv Desk | Tue, Jan 14, 2020, 07:30 PM

ఆస్ట్రేలియాలో ఈ వేసవి అధిక ఉష్ణోగ్రతల కారణంగా భగ్గుమంటోంది. కార్చిచ్చు వేలాది కిలోమీటర్ల మేర వ్యాపించడంతో లక్షల మంది నిరాశ్రయులు కావడమే కాకుండా కోట్ల సంఖ్యలో జంతువులు సజీవ దహనమయ్యాయి. మరోవైపు ఆస్ట్రేలియాను తీవ్ర నీటి కరవు వేధిస్తోంది.

ఈ నేపథ్యంలో ఒంటెల కారణంగా నీటికి మరింత కటకట ఏర్పడుతున్న నేపథ్యంలో వేల సంఖ్యలో ఒంటెలను వధించాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో అధికారులు హెలికాఫ్టర్లలో తిరుగుతూ పెద్ద సంఖ్యలో ఒంటెలను చంపేస్తున్నారు. ఇప్పటివరకు ఐదు రోజుల్లో 5000కి పైగా ఒంటెలను సంహరించారు. అయితే, జంతు సంరక్షణ కార్యకర్తలు ఆస్ట్రేలియా ప్రభుత్వ నిర్ణయం పట్ల తీవ్రంగా మండిపడుతున్నారు.

Untitled Document
Advertisements