హిందువులంతా ఒక్కసారి గర్జిస్తే ఏంజరుగుతుందో ఊహించుకోండి

     Written by : smtv Desk | Tue, Jan 14, 2020, 07:32 PM

నిర్మల్ జిల్లా భైంసాలో రెండు వర్గాల మధ్య ఘర్షణలు ఉద్రిక్తతలకు దారితీయడం పట్ల కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ స్పందించారు. హిందూ ధర్మ పరిరక్షణ కార్యకర్తలపై దాడి జరిగిందని అన్నారు. ఇలాంటి ఘటనల పట్ల ప్రభుత్వం పక్షపాతంతో వ్యవహరించడం సిగ్గుచేటని మండిపడ్డారు. ఓ వర్గం వ్యక్తులు 18 ఇళ్లను దహనం చేస్తుంటే ప్రభుత్వం ఏంచేస్తోందని ప్రశ్నించారు. టీఆర్ఎస్ సర్కారు అండతో ఎంఐఎం గూండాలు చెలరేగిపోతున్నారని, ఇవాళ భైంసాలో జరిగిన ఘటన రేపు దేశవ్యాప్తంగా పాకే అవకాశముందని హెచ్చరించారు. హిందూ వాహిని కార్యకర్తలపై దాడి చేసి ఏదో సాధించామని గొప్పగా ఫీలైపోవద్దని, దేశవ్యాప్తంగా ప్రతి హిందువు సింహమై గర్జిస్తారని అన్నారు. హిందువులంతా ఒక్కసారి గర్జిస్తే ఏంజరుగుతుందో ఊహించుకోండి అంటూ ఆవేశపూరిత వ్యాఖ్యలు చేశారు.

Untitled Document
Advertisements