చిన్నారి ప్రాణం తీసిన హెల్మెట్!

     Written by : smtv Desk | Fri, Jan 17, 2020, 05:52 PM

చిన్నారి ప్రాణం తీసిన హెల్మెట్!

ఇంగ్లాండ్‌లోని బైసెస్టర్‌లో విషాద ఘట చోటుచేసుకుంది. ఫ్రెయా దార్పే అనే నాలుగేళ్ల చిన్నారి.. హెల్మెట్ పెట్టుకుని గార్డెన్‌లో సైకిల్ తొక్కుతోంది. తోటి స్నేహితులతో ఆడుకుంటూ చెట్టు మీదకు ఎక్కేందుకు ప్రయత్నించింది. కాలు జారడంతో ఆమె కొమ్మ మీద పడింది. దీంతో హెల్మెట్‌ కొమ్మకు చిక్కుకుంది. దాని స్ట్రాప్ (తాడు) ఆమె మెడకు బిగుసుకుంది.ఎలిసబెత్ మెక్కాల్ అనే మహిళ అటుగా వెళ్తూ.. చెట్టుకు వేలాడుతున్న ఫ్రెయాను చూసింది. వెంటనే ఎమర్జెన్సీ నెంబరు 999కు ఫోన్ చేసి చిన్నారిని కాపాడేప్రయత్నం చేసింది. నేలకు సుమారు 4 అడుగుల ఎత్తులో చెట్టుకు వేలాడుతున్న ఫ్రెయాను కిందికి దించడం ఆమె వల్ల కాలేదు. దీంతో అటుగా వెళ్తున్న కొందరు ఆమెకు సాయం చేసి ఫ్రెయాను కిందికి దించి సీపీఆర్ ద్వారా ప్రాణం కాపాడేందుకు ప్రయత్నించారు. కానీ, ఆమెలో చలనం కనిపించలేదు.ఈ సమాచారం అందుకున్న 25 నిమిషాల తర్వాత వైద్యులు వచ్చారు. స్థానిక జాన్ ర్యాడ్‌క్లిఫే హాస్పిటల్‌కు తరలించారు. ఫ్రేయా కోమాలోకి వెళ్లినట్లు గుర్తించిన వైద్యులు ఆమెకు కృత్రిమ శ్వాస అందించారు. ఆమెను కాపాడేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశారు. కానీ, ఆ చిన్నారి కోలుకోలేదు. రెండు రోజుల తర్వాత ఆమె ప్రాణాలు విడిచింది. చిన్నారి తల్లికి కవల పిల్లలు పుట్టిన కొద్ది రోజుల్లోనే ఈ విషాదం చోటుచేసుకోవడం గమనార్హం.






Untitled Document
Advertisements