ఎయిర్ టెల్, జియో 84 రోజుల రీచార్జ్ ప్లాన్స్

     Written by : smtv Desk | Fri, Jan 17, 2020, 06:56 PM

ఎయిర్ టెల్, జియో 84 రోజుల రీచార్జ్ ప్లాన్స్

ఒకప్పుడు లాంగ్ టర్మ్ అన్ లిమిటెడ్ ప్లాన్లను ముందుగా ప్రారంభించి జియో కస్టమర్లందరినీ ఆకర్షించడంతో ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా కూడా అటువంటి ప్లాన్లను ప్రకటించాయి. అయితే 28 రోజుల వ్యాలిడిటీ ఉన్న ప్లాన్లతో పోలిస్తే 84 రోజుల వ్యాలిడిటీ ఉన్న ప్లాన్లతో రీచార్జ్ చేసుకుంటే వినియోగదారులకు ఎక్కువ లాభాలు అందుతాయి. ప్రస్తుతం ఎయిర్ టెల్, జియో అందించే 84 రోజుల ప్లాన్లు ఇవే..

​జియో రూ.329 ప్లాన్:

ఎక్కువ ఇంటర్నెట్ వాడకుండా తక్కువ ధరలో ప్లాన్ కోసం చూస్తున్నవారికి ఈ ప్లాన్ బాగా ఉపయోగపడుతుంది. ఈ ప్లాన్ ద్వారా మొత్తం 84 రోజుల కాలానికి 6 జీబీ డేటా లభిస్తుంది. జియో నుంచి జియోకు ఉచితంగా అన్ లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు వేరే నెట్ వర్క్ లకు కాల్స్ చేసుకోవడానికి 3,000 ఉచిత నిమిషాలు అందిస్తారు. దీంతో పాటు ప్రతి రోజూ 100 ఎస్ఎంఎస్ లు లభిస్తాయి. జియో టీవీ, జియో సినిమా, జియో మ్యూజిక్ వంటి జియో యాప్స్ కు కాంప్లిమెంటరీ సబ్ స్క్రిప్షన్ కూడా లభిస్తుంది.

​జియో రూ.555 ప్లాన్:

ఇంటర్నెట్ ను ఓ మాదిరిగా ఉపయోగించే వారు ఈ ప్లాన్ తో రీచార్జ్ చేసుకోవచ్చు. ఈ రూ.555 ప్లాన్ తో రీచార్జ్ చేసుకుంటే 84 రోజుల పాటు రోజుకు 1.5 జీబీ డేటా లభిస్తుంది. జియో నుంచి జియోకు ఉచితంగా అన్ లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. వేరే నెట్ వర్క్ లకు కాల్స్ చేసుకోవడానికి పై ప్లాన్ మాదిరిగానే 3,000 ఉచిత నిమిషాలు లభిస్తాయి. రోజుకు 100 ఎస్ఎంఎస్ లు అందిస్తారు. జియో యాప్స్ కు కాంప్లిమెంటరీ సబ్ స్క్రిప్షన్ కూడా లభిస్తుంది.

​జియో రూ.599 ప్లాన్:

ఈ ప్లాన్ మాత్రం ఇంటర్నెట్ భారీగా ఉపయోగించేవారికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే 84 రోజుల పాటు రోజుకు 2 జీబీ డేటా లభిస్తుంది. పై ప్లాన్ల తరహాలోనే జియో నుంచి జియోకు అన్ లిమిటెడ్ ఉచిత కాల్స్, వేరే నెట్ వర్క్ లకు కాల్ చేసుకోవడానికి 3000 ఉచిత నిమిషాలతో పాటు రోజుకు 100 ఎస్ఎంఎస్ లు కూడా అందిస్తారు. జియో యాప్స్ కు కాంప్లిమెంటరీ సబ్ స్క్రిప్షన్ కూడా కామనే. ఒక్క డేటా తప్పితే మిగతా లాభాలన్నీ ఈ మూడు ప్లాన్లలో ఒకేలా ఉండటం విశేషం. కాబట్టి మీరు ఎంత డేటా ఉపయోగిస్తారో దానికి అనుగుణంగా ప్లాన్ ను ఎంచుకోండి.

*​ఎయిర్ టెల్ రూ.379 ప్లాన్:

ఈ ప్లాన్ కు జియో రూ.329 ప్లాన్ కూ ఎన్నో పోలికలు ఉన్నాయి. ఆ ప్లాన్ తరహాలోనే ఇందులో కూడా మొత్తం 6 జీబీ అందిస్తున్నారు. మొత్తంగా 900 ఎస్ఎంఎస్ లు లభిస్తాయి. అయితే కాల్స్ విషయంలో ఎయిర్ టెల్ మార్కులు కొట్టేసింది. ఏ నెట్ వర్క్ కు అయినా అన్ లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. దీంతో పాటు షా అకాడమీ నాలుగు వారాల ఉచిత కోర్సు, వింక్ మ్యూజిక్ యాక్సెస్, ఎయిర్ టెల్ ఎక్స్ ట్రీమ్ యాప్ కు ఉచిత యాక్సెస్, ఫాస్టాగ్ పై రూ.150 క్యాష్ బ్యాక్ కూడా లభిస్తాయి.

​*ఎయిర్ టెల్ రూ.598 ప్లాన్:

ఈ ప్లాన్ కూడా జియో రూ.555 ప్లాన్ తరహాలోనే ఉంటుంది. ఆ ప్లాన్ లాగానే రోజుకు 1.5 జీబీ డేటా లభిస్తుంది. ఏ నెట్ వర్క్ కు అయినా అన్ లిమిటెడ్ ఉచిత కాల్స్ చేసుకోవచ్చు. ప్రతిరోజూ 100 ఎస్ఎంఎస్ లు లభిస్తాయి. రూ.379 ప్లాన్ తో లభించే అదనపు లాభాలన్నీ దీంతో కూడా లభిస్తాయి.

​*ఎయిర్ టెల్ రూ.698 ప్లాన్:

ఇది కూడా జియో రూ.599 తరహాలో ఇంటర్నెట్ ఎక్కువగా ఉపయోగించే వాళ్ల కోసం రూపొందించిన ప్లాన్. 84 రోజుల పాటు ప్రతి రోజూ 2 జీబీ డేటా ఈ ప్లాన్ ద్వారా లభిస్తుంది. ఏ నెట్ వర్క్ కు అయినా ఉచితంగా అన్ లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. ప్రతి రోజూ 100 ఎస్ఎంఎస్ లు లభిస్తాయి. రూ.379, రూ.598 ప్లాన్ ద్వారా లభించే అదనపు లాభాలన్నీ ఈ ప్లాన్ ద్వారా కూడా లభిస్తాయి.





Untitled Document
Advertisements