మార్కెట్లోకి హోండా యాక్టివా 6జీ!

     Written by : smtv Desk | Fri, Jan 17, 2020, 07:41 PM

మార్కెట్లోకి హోండా యాక్టివా 6జీ!

హోండా తాజాగా సరికొత్త యాక్టివా 6జీ మోడల్‌ను మార్కెట్లోకి తెచ్చింది. హోండా యాక్టివా 6జీ ధర అందుబాటులోనే ఉందని చెప్పుకోవచ్చు. ఈ స్కూటర్ ధర రూ.63,912గా (ఎక్స్‌షోరూమ్) ఉంది. హోండా యాక్టివా మార్కెట్‌లోకి వచ్చినప్పటి నుంచి కస్టమర్లను ఆకట్టుకుంటూనే వస్తోంది. బెస్ట్ సెల్లింగ్ స్కూటర్‌గా దుమ్మురేపుతోంది. బజాజ్ కంపెనీ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇటీవలనే చేతక స్కూటర్‌‌ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. కంపెనీ చేతక్ స్కూటర్‌తో మళ్లీ స్కూటర్ల విభాగంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు ఈ చేతక్‌తో పోలిస్తే హోండా యాక్టివా 6జీ ధర దాదాపు రూ.36,000 తక్కువగా ఉండటం గమనార్హం. అయితే ఇక్కడ బజాజ్ చేతక ఎలక్ట్రిక్ స్కూటర్. కొత్త హోండా 6జీ స్కూటర్‌లో చెప్పుకోదగ్గ ప్రత్యేక అంశం ఇంజిన్. కంపెనీ బీఎస్ 6 ఇంజిన్‌తో ఈ స్కూటర్‌ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన లేటెస్ట్ కాలుష్య ఉద్గార ప్రమాణాలకు ఈ ఇంజిన్ అనువుగా ఉంది. హోండా 6జీ స్కూటర్‌లో పలు ప్రత్యేకతలు ఉన్నాయి. పాత మోడల్‌లో పోలిస్తే కొత్త దానిలో పలు మార్పులను గమనించొచ్చు. కొత్తగా డిజైన్ చేసిన ఫ్రంట్ ఎప్రాన్, కొత్త ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్ వంటి పలు మార్పులు ఉన్నాయి. హోండా 2020 యాక్టివా 6జీ స్కూటర్‌లో మల్టీ ఫంక్షన్ కీ ఉంటుంది. దీనికి రిమోట్ యాక్సె్స్ కూడా ఉంది. అంటే కీ సాయంతో దూరం నుంచే ఫ్యూయెల్ ట్యాంక్ మూత ఓపెన్ చేయొచ్చు. దీనితోపాటు స్కూటర్‌లో ఇంజిన్ కిల్ స్విచ్ కూడా ఉంటుంది. కొత్త హోండా 6జీ స్కూటర్ ఆరు రంగుల్లో కస్టమర్లకు అందుబాటులో ఉంటుంది. రెండు వేరియంట్ల రూపంలో లభ్యమౌతోంది. స్టాండర్డ్, డీలక్స్ అనేవి వేరియంట్లు. అలాగే స్కూటర్‌లో సీటు కూడా కొంచెం పొడవుగా ఉంటుంది. స్టాండర్డ వేరియంట్ ధర రూ.63,912గా ఉంది. ఇక కంపెనీ డీలక్స్ వేరియంట్ ధరను రూ.65,412గా నిర్ణయించింది. ఈ కొత్త స్కూటర్‌‌లో మరో అదిరిపోయే ఫీచర్ కూడా ఉంది. ఈ స్కూటర్‌లో సైలెంట్ స్టార్ట్ ఏసీజీ మోటార్ ఉంటుంది. అంటే స్కూటర్ సైలెంట్‌గానే స్టార్ట్ అవుతుంది. శబ్దం రాదు. కంపెనీ అలాగే ఈ హోండా 6జీలో ఈఎస్‌పీ టెక్నాలజీని కూడా అమర్చింది. హోండా యాక్టివా 6జీ కొత్త మోడల్ పాత వాటితో పోలిస్తే ఎక్కువ మైలేజ్ ఇస్తుందని కంపెనీ తెలిపింది. పాత మోడళ్ల కన్నా దాదాపు 10 శాతం ఎక్కువ మైలేజ్ పొందొచ్చని పేర్కొంది. ఇందులో 110 సీసీ ఇంజిన్ ఉంటుంది. కార్బురేటర్ స్థానంలో ఫ్యూయెల్ ఇంజెక్షన్ సిస్టమ్ ఉంటుంది.





Untitled Document
Advertisements