రబాడా శ్రుతిమించిన సెలబ్రేషన్స్...ఒక మ్యాచ్ నిషేధం!

     Written by : smtv Desk | Fri, Jan 17, 2020, 07:58 PM

రబాడా శ్రుతిమించిన సెలబ్రేషన్స్...ఒక మ్యాచ్ నిషేధం!

సౌతాఫ్రికా పేసర్ కగిసో రబాడాపై ఒక మ్యాచ్ నిషేధం పడింది. ఇంగ్లాండ్‌తో మూడోటెస్టు గురువారం తొలిరోజు ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్‌ను ఔట్ చేసిన అనంతరం రబాడ చేసిన సెలెబ్రేషన్స్ డంతో ఐసీసీ కొరడా ఝుళిపించింది. గతంలోనూ ఐసీసీ మందలింపునకు గురైన రబాడా.. తాజా పరిణామంతో నాలుగో టెస్టుకు దూరమయ్యాడు. ఇంతకీ రబాడ ఏం చేశాడంటే..? రూట్‌ను ఔట్ చేసిన అనంతరం అతని ముందు బిగ్గరగా అరుస్తూ సెలబ్రేట్ చేసుకున్నాడు. దీనిపై అన్ని వైపుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. దీనిపై విచారణ జరిపిన ఐసీసీ అతను ఆటగాళ్ల ప్రవర్తన నియామవళి నిబంధన 2.5ను అతిక్రమించాడని తేల్చింది. దీంతో అతని మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత విధించడంతోపాటు ఒక డీ మెరిట్ పాయింట్‌ను కేటాయించింది. దీంతో అప్పటికే తన ఖాతాలో ఉన్న డీ మెరిట్ పాయింట్లతో కలిపి ఒకటెస్టు నిషేధానికి రబాడ గురయ్యాడు. నిజానికి గతంలోనూ రబాడ దురుసు ప్రవర్తన కారణంగా ఐసీసీ మందలింపునకు గురయ్యాడు. ఒకసారి సస్పెండ్‌కు గురయ్యాడు. మరోవైపు అతనికి కేటాయించిన డీ మెరిట్ పాయింట్లలో నాలుగు గడువు తీరాయి. లేకుంటే ఎప్పుడో నిషేధం బారిన పడాల్సి ఉండేవాడని విశ్లేషకులు పేర్కొంటున్నారు. మరోవైపు రబాడపై విధించిన ఒక టెస్టు నిషేధంపై ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్, జోనాథన్ ట్రాట్ పెదవి విరిచారు. చిన్న విషయానికి ఐసీసీ కఠినంగా వ్యవహరించిందని వ్యాఖ్యానించారు. ప్రత్యర్థి జట్టులోని ఉత్తమ ఆటగాడిని ఔట్ చేసిన ఆనందంలో రబాడ అలా ప్రవర్తించాడని తెలిపారు.






Untitled Document
Advertisements