“ఆర్ ఆర్ ఆర్” లో పోలీస్ అధికారిగా

     Written by : smtv Desk | Sat, Jan 18, 2020, 12:28 PM

ఎస్ ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్ ఆర్ ఆర్. అయితే ఈ చిత్రంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ లు నటిస్తుండటంతో ఈ చిత్రం ఫై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం చిత్రీకరణ మొదలైనప్పటి నుండి ఎదో ఒక రకంగా వార్తల్లో నిలుస్తూనే వుంది. అయితే ఈ చిత్రానికి సంబంధించిన మరొక లేటెస్ట్ అప్డేట్ సినీ వర్గాల్లో చెక్కర్లు కొడుతోంది. ఇందులో కన్నడ సూపర్ స్టార్ సుదీప్ నటిస్తున్నారనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి. దాంతో సుదీప్ ఈ చిత్రంలో ఎలాంటి పాత్రలో నటించనున్నాడో అని సర్వత్రా ఆసక్తి మొదలైంది. సుదీప్ ఈ చిత్రంలో పోలీస్ అధికారిగా నటించనున్నారు అని సమాచారం.

అయితే రాజమౌళి దర్శకత్వం వహించిన ఈగ, బాహుబలి చిత్రాలలో సుదీప్ నటించారు. తెలుగు ప్రేక్షకులు సైతం సుదీప్ నటనకు మంచి మార్కులే వేశారు. అయితే ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ లో నటిస్తున్నారని తెలియడం తో సర్వత్రా ఆసక్తి నెలకొంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ లు స్వాతంత్ర్య పోరాట యోధులుగా కనిపించబోతున్నారు. వీరి సరసన అలియా భట్, ఒలీవియా మోరిస్ కథానాయికలుగా నటిస్తున్నారు. జులై ముప్పై న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకి రానుంది.





Untitled Document
Advertisements