రిలయన్స్ లాభం రూ. 11,640 కోట్లు!

     Written by : smtv Desk | Sat, Jan 18, 2020, 02:09 PM

రిలయన్స్ లాభం రూ. 11,640 కోట్లు!

డిసెంబర్‌ తో ముగిసిన మూడో క్వార్టర్లో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌‌ లిమిటెడ్‌ లాభం 13.55 శాతం పెరగ్గా, ఆదాయం మాత్రం 2.49 శాతం తగ్గింది. టెలికం, రిటైల్‌‌ బిజినెస్‌‌లలో మెరుగైన పనితీరు వల్లే ఫలితాలు బాగున్నాయని ఛైర్మన్‌ ముఖేష్‌‌ అంబాని చెప్పారు. డిసెంబర్‌2019 క్వార్టర్లో రిలయన్స్‌ లాభం రూ.11,640కోట్లకు చేరింది. ఇక ఇదే క్వార్టర్‌ కు ఆదాయం రూ.1,57,000 కోట్లకు పరిమితమైంది. రిలయన్స్‌ మూడో క్వార్టర్లో రూ.11,181 కోట్ల లాభం ప్రకటిస్తుందని మార్కెట్‌‌ వర్గాలు అంచనా వేశాయి. ఐతే,అంతకంటే మెరుగైన లాభం ప్రకటించింది కంపెనీ. స్టాండ్‌ ఎలోన్‌ ప్రాతిపదికన కంపెనీ లాభం 7.36 శాతం పెరిగి రూ. 9,585 కోట్లకు చేరింది.తాజా క్వార్టర్లో గ్రాస్‌‌ రిఫైనింగ్‌‌ మార్జిన్‌ (జీఆర్‌ ఎం) బ్యారెల్‌‌కు 9.2 డాలర్లకు పెరిగినట్లు ఆర్‌ఐఎల్‌‌ తెలిపింది. ఎనలిస్టులు ఇది 9.4 డాలర్లుంటుందని అంచనా వేశారు. ఇక రిలయన్స్‌ రిటైల్‌‌ ఆదాయం డిసెంబర్‌ 2019 క్వార్టర్లో 27 శాతం పెరగ్గా, జియో ఆదాయం 28 శాతం పెరిగింది. పెట్రోకెమికల్స్‌ బిజినెస్‌‌ ఆదాయం రూ. 36,909 కోట్లకు చేరింది. మార్కెట్లో సప్లై పెరగడంతో పెట్‌‌కెమ్‌ మార్జిన్స్‌ పై ఒత్తిడి ఉంటుందని ఎనలిస్టులు ముందుగానే ఊహించారు. హాలీడే సేల్స్‌ , పండగల సీజన్‌ కావడంతోపాటు, స్టోర్స్‌ సంఖ్యా పెంచడంతో రిటైల్‌‌ బిజినెస్‌‌ పనితీరు మెరుగ్గానే ఉంది. బీపీతో కలిసి పెట్రో రిటైల్‌‌ వ్యాపారాన్ని దేశమంతటా విస్తరించనున్నట్లు ఈక్వార్టర్లోనే రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌‌ లిమిటెడ్‌ ప్రకటించింది. ఆర్‌ఐఎల్‌‌ షేర్లుగా మార్చుకునే వీలునూ రిలయన్స్‌ రిటైల్‌‌ షేర్‌ హోల్డర్లకు కంపెనీ కల్పించింది.ఇందుకోసం ప్రకటించిన రేషియోను బట్టి చూస్తే రిలయన్స్‌ రిటైల్‌‌ బిజినెస్‌‌ వ్యాల్యుయేషన్‌ 36 బిలియన్‌ డాలర్లకు చేరినట్లు. రిలయన్స్‌ జియో లాభం మూడో క్వార్టర్లో 62.45శాతం పెరిగి రూ. 1,350 కోట్లకు చేరింది. కాకపోతే,ఏఆర్‌ పీయూ మాత్రం రూ. 128.40 కి తగ్గిపోయింది. జియో ప్లాట్‌‌ఫామ్స్‌ మొత్తం క్యాపిటలైజేషన్‌ మాత్రం రూ.1.70 లక్షల కోట్లకు పెరిగినట్లు ఆర్‌ఐఎల్‌‌ పేర్కొంది.





Untitled Document
Advertisements