మరో డిఫరెంట్‌ మూవీకి రెడీ అయిన అల్లరి నరేష్

     Written by : smtv Desk | Sat, Jan 18, 2020, 03:01 PM

మరో డిఫరెంట్‌ మూవీకి రెడీ అయిన అల్లరి నరేష్

హిట్స్‌తో మినిమమ్‌ గ్యారెంటీ హీరోగా పేరు తెచ్చుకున్న నటుడు అల్లరి నరేష్‌. రాజేంద్ర ప్రసాద్ తరువాత ఆ తరహా సినిమాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారిన అల్లరి నరేష్‌ వరుస విజయాలతో ఆకట్టుకున్నాడు. జెట్‌ స్పీడుతో 50 సినిమాలు పూర్తి చేసిన ఈ యంగ్ హీరో తరువాత ఒక్కసారిగా కెరీర్‌లో వెనకపడ్డాడు. మూస కథలు రొటీన్‌ కామెడీ సినిమాలు ఆడియన్స్‌కు బోర్‌ కొట్టడంతో నరేష్‌ కెరీర్‌ ఇబ్బందుల్లో పడింది. సుడిగాడు సినిమా తరువాత ఈ యంగ్ హీరోకు సాలిడ్‌ హిట్ ఒక్కటి కూడా దక్కలేదు. దీంతో కాస్త స్లో అయిన నరేష్‌ డిఫరెంట్ సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఇటీవల మహర్షి సినిమాలో మహేష్ బాబుతో కలిసి నటించి ఆకట్టుకున్నాడు. తాజాగా మరో డిఫరెంట్‌ మూవీకి రెడీ అవుతున్నాడు అల్లరి నరేష్‌. అయితే ఈ సినిమాలో పూర్తిగా యాక్షన్‌ రోల్‌లో కనిపించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. సినిమా ప్రారంభోత్సవ ఆహ్వానం అంటూ ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్‌. ప్రస్తుతం బంగారు బుల్లోడు సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న నరేష్‌ ఈ సినిమా తరువాత విజయ్‌ కనకమేడల దర్శకత్వంలో ఓ డిఫరెంట్ సినిమా చేయనున్నాడు. సోమవారం రామానాయుడు స్టూడియోలో ప్రారంభం కానున్న ఈ సినిమాను ఎస్వీ 2 ఎంటర్‌టైన్మెంట్స్‌ పతాకంపై సతీష్‌ వేగేశ్న ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శ్రీ చరణ్‌ పాకల సంగీతమందిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు సోమవారం వెల్లడించనున్నారు.






Untitled Document
Advertisements