పీపీఎఫ్ స్కీమ్...రూ.200తో చేతికి రూ.20 లక్షలు!!!

     Written by : smtv Desk | Sat, Jan 18, 2020, 05:11 PM

పీపీఎఫ్ స్కీమ్...రూ.200తో చేతికి రూ.20 లక్షలు!!!

ఎక్కువ రిస్క్ తీసుకోకుండా చేతిలోని డబ్బుతో అదిరిపోయే రాబడి పొందాలని భావిస్తే మీకు ఒక ఆప్షన్ ఉంది. అదే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) స్కీమ్. కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అందిస్తోంది. పీపీఎఫ్ స్కీమ్ చాలా పాపులర్. దీనికి ప్రధాన కారణం ఈ పథకంలో వల్ల రెండు ప్రయోజనాలు పొందొచ్చు. అదిరిపోయే రాబడితోపాటు పన్ను మినహాయింపు ప్రయోజనాలు కూడా లభిస్తాయి. అందుకే చాలా మంది పీపీఎఫ్ అకౌంట్‌లో డబ్బులు దాచుకుంటూ ఉంటారు. పీపీఎఫ్ ఖాతా మెచ్యూరిటీ కాలం 15 ఏళ్లు. అంటే మీరు కచ్చితంగా పీపీఎఫ్ అకౌంట్‌ను 15 ఏళ్ల పాటు కొనసాగించాల్సి ఉంటుంది. అకౌంట్‌ మెచ్యూరిటీ కాలాన్నీ అవసరం అనుకుంటే ఐదేళ్లు పొడిగించుకోవచ్చు. మీరు ఏడాదికి పీపీఎఫ్‌ ఖాతాలో రూ.1.5 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయవచ్చు. దీంతో మెచ్యూరిటీ సమంయలో భారీ రాబడితోపాటు పన్ను ప్రయోజనాలు పొందొచ్చు. కనీసం రూ.500 ఇన్వెస్ట్ చేసినా సరిపోతుంది. మీ అకౌంట్ యాక్టివ్‌గానే ఉంటుంది. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్)లో ఇన్వెస్ట్ చేయాలంటే ముందుగా అకౌంట్ తెరవాలి. బ్యాంక్‌ లేదా పోస్టాఫీస్‌కు వెళ్లి పీపీఎఫ్ ఖాతాను తెరవొచ్చు. రూ.100తో ఖాతాను తెరవొచ్చు. తర్వాత డబ్బులు డిపాజిట్ చేసుకుంటూ వెళ్లొచ్చు. పీపీఎఫ్‌ అకౌంట్‌పై వడ్డీ రేటు స్థిరంగా ఉండదు. మూడు నెలలకు ఒకసారి మారుతూ ఉండొచ్చు. కేంద్ర ప్రభుత్వం పీపీఎఫ్ ఖాతాపై వడ్డీ రేటను సవరిస్తూ ఉంటుంది. అంటే వడ్డీ రేటు పెరగొచ్చు. లేదంటే తగ్గొచ్చు. కొన్ని సందర్భాల్లో స్థిరంగా కూడా ఉండొచ్చు. ప్రస్తుతం పీపీఎఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్లపై 7.9 శాతం వడ్డీ లభిస్తుంది. మీరు రోజుకు రూ.200 పీపీఎఫ్ అకౌంట్‌లో ఇన్వెస్ట్ చేస్తే అది నెలకు రూ.6,000, సంవత్సరానికి రూ.72,000 అవుతుంది. ఏడాదికి రూ.72,000 చొప్పున పీపీఎఫ్‌లో 15 ఏళ్లు ఇన్వెస్ట్ చేస్తే ప్రస్తుత వడ్డీ రేటు ప్రకారం మీరు మెచ్యూరిటీ సమయంలో రూ.20 లక్షలకు పైగా పొందొచ్చు. పీపీఎఫ్ ఇన్వెస్ట్‌మెంట్లపై పూర్తి పన్ను మినహాయింపు ఉంటుంది. ఇన్వెస్ట్ చేసిన డబ్బు, అర్జించిన వడ్డీ, విత్‌డ్రా చేసుకునే మొత్తంపై ఎలాంటి పన్ను ఉండదు. అందువల్ల మీరు పీపీఎఫ్ అకౌంట్‌లో ఇన్వెస్ట్ చేయడం వల్ల అదిరిపోయే రాబడి మాత్రమే కాకుండా పన్ను ప్రయోజనాలు కూడా పొందొచ్చు.





Untitled Document
Advertisements