ఉబెర్‌లో డేటింగ్ సేవలు... కేవలం నడిచేందుకు మాత్రమే!

     Written by : smtv Desk | Sat, Jan 18, 2020, 05:19 PM

ఉబెర్‌లో డేటింగ్ సేవలు... కేవలం నడిచేందుకు మాత్రమే!

పైన టైటిల్ చూసి ‘ఉబెర్’ యాప్.. ట్రావెల్, ఫుడ్ డెలవరీ సర్వీసులు మాత్రమే చేస్తుంది కదా, కొత్తగా డేటింగ్ కూడా మొదలుపెట్టిందా అనుకుంటున్నారా? అలాంటి ఆశలు పెట్టుకోకండి. అది కేవలం నడిచేందుకు తోడు కావాలా అని మాత్రమే అడుగుతోంది. ఉబెర్ ఇప్పటివరకు ఉబెర్ క్యాబ్, ఉబెర్ బైక్ వంటి సేవలను మాత్రమే అందిస్తోంది. అయితే, ఇటీవల ట్వి్ట్టర్‌లో ‘వాకింగ్ బడ్డీ’ అనే ఆప్షన్‌తో ఓ స్క్రీన్ షాట్ ప్రత్యక్షమైంది. దీంతో నెటిజన్స్.. ఉబెర్ యాప్‌ను అప్‌డేట్ చేసుకుని మరీ ‘ఆ’ సేవలు పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. ఉబెర్ వినియోగదారులు క్యాబ్ లేదా బైక్‌లో కాకుండా నడుచుకుని వెళ్లాలనిపిస్తే ఈ ఆప్షన్ ఉపయోగపడుతుంది. ఒంటరిగా నడవడం బోరింగ్ అనిపిస్తే.. ‘వాకింగ్ బడ్డీ’ ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవచ్చు. అతడు లేదా ఆమెతో మీరు ఎంత దూరమైన నడవచ్చు.. ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు. మీరు ఎంచుకొనే దూరాన్ని బట్టి ఈ ధర ఉంటుంది. ట్విట్టర్‌లో ట్రెండవుతున్న స్క్రీన్ షాట్ ప్రకారం.. 7.50 డాలర్ల ధర ఉంది. భారత కరెన్సీ ప్రకారం రూ.533 చెల్లించాలి. ఆప్షన్ మీద నెటిజనులు రకరకాల జోకులు పేలుస్తూ కడుపుబ్బా నవ్విస్తున్నారు. ఈ ట్వీట్ ప్రపంచవ్యాప్తంగా వైరల్ కావడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. దీంతో ‘ఉబెర్’ సంస్థ దీనిపై స్పందించక తప్పలేదు. అలాంటి ఆప్షన్ ఏదీ ఇప్పటివరకు ప్రారంభించలేదని తెలిపింది. ప్రారంభించే ఆలోచన ఉందని పేర్కొంది.





Untitled Document
Advertisements