లండన్‌లో గుండెపోటుతో తెలుగు వైద్యురాలు మృతి

     Written by : smtv Desk | Sat, Jan 18, 2020, 06:03 PM

లండన్‌లో గుండెపోటుతో తెలుగు వైద్యురాలు మృతి

లండన్‌ సదస్సులో ప్రసంగిస్తూ గుండెపోటుకు గురైన సీనియర్ న్యూరాలజిస్ట్, ప్రొఫెసర్, నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(నిమ్స్) డాక్టర్ ఎకె మీనా కుమారి మృతి చెందారు. మీనాకుమారిని కాపాడటానికి వైద్యులు చివరి నిమిషం వరకు ప్రయత్నించారని యూకె డిప్యూటి హై కమిషనర్‌ డాక్టర్ ఆండ్రూ ఫ్లెమింగ్‌ ట్వీట్టర్ ద్వారా వెల్లడించారు. ఆమె కుటుంబానికి, సన్నిహితులకు సంతాపాన్ని ప్రకటించారు. డాక్టర్ మీనా కుమారి, న్యూరాలజీ ఫ్యాకల్టీ మంగళవారం లండన్‌లో జరిగిన అంతర్జాతీయ వైద్య సమావేశానికి హాజరయ్యారు. ఆ సమయంలో డాక్టర్ మీనాకు గుండెనొప్పి రావడంతో ఒక్కసారిగా కుప్పకూలారు. వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం లండన్ ఆసుపత్రికి తరించారు. అక్కడి వైద్యులు అత్యవసర యాంజియోప్లాస్టీ నిర్వహించి, అడ్డుపడే ధమనులను అన్‌బ్లాక్ చేయడానికి మూడు స్టెంట్లను అమర్చారు. డాక్టర్ మీనా బ్రెయిన్ స్ట్రోక్‌తో బాధపడతున్నప్పుడు గుండెపోటు నుంచి కోలుకునేందుకు వీలుగా వెంటిలేటర్ సపోర్ట్‌తో చికిత్స అందించినా ఆమెను కాపాడలేకపోయారు.





Untitled Document
Advertisements