BIG NEWS: నిర్మలా సీతారామన్‌పై వేటు!...కొత్త ఆర్థిక మంత్రిగా ఆయన?

     Written by : smtv Desk | Sat, Jan 18, 2020, 06:09 PM

BIG NEWS: నిర్మలా సీతారామన్‌పై వేటు!...కొత్త ఆర్థిక మంత్రిగా ఆయన?

మోదీ ప్రభుత్వం నిర్మలా సీతారామన్‌పై వేటు వేయడానికి రెడీ అవుతోందా? ఈ ప్రశ్నలకు సమాధానం అవుననే వినిపిస్తోంది. కేంద్రం నిర్మలా సీతారామన్ స్థానంలోకి కొత్త ఆర్థిక మంత్రిని తీసుకురాబోతోందనే వార్తలు ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. మోదీ సర్కార్ అప్‌కమింగ్ బడ్జెట్ తర్వాత నిర్మలా సీతారామన్ స్థానంలోకి కొత్త ఆర్థిక మంత్రిని తీసుకురాబోతోందని వార్తలు వినిపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1న 2020 బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతోంది. బడ్జెట్ తర్వాత కొత్త ఆర్థిక మంత్రి మార్పు ఉండొచ్చనే అంచనాలున్నాయి. కొత్త ఆర్థిక మంత్రి రేసులో బ్రిక్స్ బ్యాంక్ ప్రస్తుత చీఫ్ కేవీ కామత్ ముందు వరుసగాలో ఉన్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. కర్నాటకలోని మంగళూరులో జన్మించిన ఈయన గతంలో ఐసీఐసీఐ బ్యాంక్ చైర్మన్‌గా పనిచేశారు. అలాగే దేశీ రెండో అతిపెద్ద ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్‌కు చైర్మన్‌గా కూడా వ్యవహరిచారు. పద్మ భూషణ్ సహా ఎన్నో అవార్డులు పొందారు. దేశ ఆర్థిక వ్యవస్థ డీలా పడింది. జీడీపీ వృద్ధి రేటు పడిపోతూ వస్తోంది. మందగమన పరిస్థితులు కనిపిస్తున్నాయి. నిరుద్యోగిత పెరిగింది. ఉద్యోగాలు ఊడిపోతున్నాయి. డిమాండ్ పడిపోయింది. కంపెనీలు ఉత్పత్తిని తగ్గిస్తున్నాయి. ధరలు కూడా పెరిగిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కొత్త ఆర్థిక మంత్రి వార్తలు ప్రాధాన్యం సంతరించుకుంటున్నాయి. అయితే కొన్ని వర్గాలు మాత్రం కేంద్ర ప్రభుత్వం కేవీ కామత్‌ను ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా నియమించనుందని పేర్కొంటున్నాయి. కేవీ కామత్ కొత్త ఆర్థిక మంత్రిగా వస్తారా? ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా నియమితులు అవుతారా? లేదంటే రెండూ జరగకపోవచ్చా? అనే అంశం రానున్న రోజుల్లో వెల్లడి కానుంది. మోదీ సర్కార్ బీజేపీ రాజ్యసభ ఎంపీ స్వప్న దాస్ గుప్తాకు కూడా మంత్రి పదవీ ఇవ్వొచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈయనకు మానవ వనరుల శాఖ సహాయ మంత్రి పదవి లభించొచ్చనే అంచనాలు నెలకొన్నాయి. అంతేకాకుండా గతంలో రైల్వే, పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేసిన సురేశ్ ప్రభు మళ్లీ మోదీ ప్రభుత్వంలోకి వచ్చే అవకాశాలున్నాయి.










Untitled Document
Advertisements