రోడ్డు ప్రమాదంలో బాలీవుడ్ నటికి తీవ్రగాయాలు

     Written by : smtv Desk | Sat, Jan 18, 2020, 06:57 PM

రోడ్డు ప్రమాదంలో బాలీవుడ్ నటికి తీవ్రగాయాలు

బాలీవుడ్ నటి షబనా ఆజ్మీ శనివారం ముంబయి-పుణె ఎక్స్‌ప్రెస్ హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. తన భర్త, ప్రముఖ సినీ కవి జావేద్ అక్తర్‌తో కలసి ఆమె కారులో పుణె నుంచి ముంబయికి ప్రయాణిస్తుండగా ముంబయికి 60 కిలోమీటర్ల దూరంలోని ఖలాపూర్ వద్ద సాయంత్రం 3.30 గంటల ప్రాంతంలో వారి కారు ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీకొంది. ఈ ప్రమాదంలో షబనాతోపాటు కారు డ్రైవర్ తీవ్రంగా గాయపడగా కారులోనే ఉన్న జావేద్ అక్తర్ మాత్రం సురక్షితంగా ఉన్నారు. తీవ్రంగా గాయపడిన షబనాతోపాటు డ్రైవర్‌ను ముంబయిలోని ఎంజిఎం ఆసుపత్రికి తరలించి చికిత్స అందచేస్తున్నారు.





Untitled Document
Advertisements